గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, డిసెంబర్ 2023, శుక్రవారం

నిరత,శక్తినెంచు,భాగ్యమేల?,భోగభూషణా,నేలిక,కటాక్షము,తావీవు,ఓలని సేవ,ఓడిపోని,తావి,ఎడమోము,చాలిక,నీవాడ,ఏగినంత,గర్భ "-ఓడనిభక్తి"- వృత్తము.. రచన . శ్రీవల్లభవఝల అప్పలనరసింహమూర్తి.

జైశ్రీరామ్. 

నిరత,శక్తినెంచు,భాగ్యమేల?,భోగభూషణా,నేలిక,కటాక్షము,తావీవు,ఓలని సేవ,ఓడిపోని,తావి,ఎడమోము,చాలిక,నీవాడ,ఏగినంత,గర్భ      "-ఓడనిభక్తి"- వృత్తము..  రచన . శ్రీవల్లభవఝల అప్పలనరసింహమూర్తి.

ఏగి నంత గొల్చినా సరే! ఏలిక నీవాడ నేను!ఎడ మోమ దేలనో?శివా!
సాగినంత భక్తి నెంచెదన్!చాలు కటాక్షంబునిమ్ము! జడిపించ నేల భద్రుడా!
భోగభాగ్య మేల?నీదరిన్!పూలకు తావీవు గాదె?పోడిమంబుపెంచు మోక్షదా!
యోగి గాను భోగభూషణా!ఓలను నీసేవలోన!ఓడిపోను భక్తి యందునన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతియందలి అనిరుద్ఛందాంతర్గత
ఉత్కృతి ఛందములోనిది.ప్రాసనియమము కలదు.
పాదమునకు 26,అక్షరములుండును.యతులు10,18,అక్షరములకు
చెల్లును.

1.గర్భగత"-నిరత"-వృత్తము.

ఏగినంత గొల్చినా సరే!
సాగినంత భక్తి నెంచెదన్!
భోగ భాగ్య మేలనో?శివా!
యోగిగాను భోగ భూషణా!

అభిజ్ఞాఛందాతర్గత బృహతీ ఛందములోనిది.ప్రాసనియమము కలదు.
పాదమునకు 9,అక్షరములుండును.

2,గర్భగత"-శక్తినెంచు"-వృత్తము.

ఏలిక నీవాడ నేను!
చాలు కటాక్షంబు నిమ్ము!
పూలకు తావీవు గాదె?
ఓలను నీ సేవ లోన!

అభిజ్ఞా ఛందాంతర్గత"అనుష్టుప్ఛందములోనీది
ప్రాసనియమము కలదు.పాదమునకు,8"అక్షరములుండును.

3.గర్భగత"-భాగ్య మేల?వృత్తము.

ఎడమోమదేలనో?శివా!
జడిపించ నేల?భద్రుడా!
పోడిమంబు పెంచు మోక్షదా!
ఓడిపోను భక్తి యందునన్!

అభిజ్ఞాఛందమునందలి"బృహతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,9,అక్షరములుండును.

4.గర్భగత"భోగభూషణ"-వృత్తము.

ఏగి నంత గొల్చినా సరే!ఏలిక నీ వాడ నేను!
సాగినంత శక్తి వెంచెదన్!చాలు కటాక్షంబు నిమ్ము!
భోగ భాగ్య మేల?నీదరిన్!పూలకు తావీవు గాదె?
యోగిగాను భోగ భూషణా!ఓలను నీ సేవలోన!

అణిమా ఛందాంతర్గత,అత్యష్టీ"ఛందములోనిది.
పాదమునకు,17,అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి,10,వయక్షరమునకు చెల్లును.

5.గర్భగత"-ఏలిక "-వృత్తము.

ఏలిక నీవాడ నేను!ఎడమోమదేలనో?శివా!
చాలు కటాక్షంబు నిమ్ము!జడిపించ నేల భద్రుడా!
పూలకు తావీవు గాదె?పోడిమంబు పెంచు మోక్షదా!
ఓలను నీ సేవ లోన!ఓడిపోను భక్తి యందునన్!

అణిమా ఛందాంతర్గత"అత్యష్టీ"-ఛందములోనిది,
పాదమునకు,17,అక్షరములుండును.ప్రాసనియమము కలదు.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-కటాక్షమ"-వృత్తము.

ఎడమోమదేలనో?శివా!ఏగినంత గొల్చినా సరే!
జడిపించ నేల?భద్రుడా!సాగినంత శక్తి నెంచెదన్!
పోడిమంబు పెంచు మోక్షదా!భోగభాగ్యమేల?నీదరిన్!
ఓడిపోను భక్తి యందునన్!యోగిగాను భోగ భూషణా!

అణిమా ఛందాంతర్గత"- ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,18,అక్షరములుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"తావీవు"-వృత్తము.

ఏగినంత గొల్చినా సరే?ఎడమో మదేలనో?శీవా!
సాగినంత శక్తి నెంచెదన్!జడిపించ నేల?భద్రుడా!
భోగ భాగ్య మేల?నీదరిన్!పోడిమంబు పెంచు మోక్షదా!
యోగి గాను భోగ భూషణా!ఓడిపోను భక్తి యందునన్!

అణిమా ఛందాంతర్గత"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 18,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-ఓలని సేవ"-వృత్తము.

ఎడమోమదేలనో?శివా!ఏలక నీవాడ నేను!
జడిపించ నేల?భద్రుడా!చాలు కటాక్షంబు నిమ్ము!
పోడిమంబు వెంచు మోక్షదా!పూలకు తావీవు గాదె?
ఓడిపోను భక్తియందునన్!ఓలను నీ సేవ లోన!

అణిమా"ఛందాంతర్గత అత్యష్టీ"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,17,అక్షరములుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-ఓడిపోని"-వృత్తము.

ఏలిక నీవాడ నేను!ఏగినంత గొల్చినా సరే!
చాలు కటాక్షంబు నిమ్ము!సాగినంత శక్తి నెంచెదన్!
పూలకు తావీవు గాదె?భోగ భాగ్యమేల?నీ దరిన్!
ఓలను నీ సేవ లోన!యోగి గాను భోగ భూషణా!

అణిమా ఛందాంతర్గత"-అత్యష్టీ"-ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు,17,అక్షరములుండును.
యతి"9,వ య్కషరమునకు చెల్లును.

10,గర్భగత"-తావి"-వృత్తము.

ఏలిక నీవాడ నేను!ఎడమోమదేలనో?శివా!ఏగినంత గొల్చినా సరే!
చాలు కటాక్షంబు నిమ్ము!జడిపించ నేల?భద్రుడా!సాగినంత శక్తి నెంచెదన్!
పూలకు తావీవు గాదె?పోడిమంబు పెంచు మోక్షదా!భోగభాగ్య మేల?నీదరిన్
ఓలను నీ సేవలోన!ఓడిపోను భక్తియందునన్!యోగిగాను భోగ భూషణా!

అనిరుద్ఛందాంతర్గత,ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు;9,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"ఎడమోము"-వృత్తము.

ఎడమోమదేలనో?శివా!ఏగినంత గొల్చినా సరే!ఏలిక నీవాడ నేను!
జడిపించ నేల?భద్రుడా!సాగినంత శక్తి నెంచెదన్!చాలు కటాక్షించు నన్ను!
పోడిమంబు పెంచు మోక్షదా!భోగభాగ్యమేల?నీదరిన్!పూలకు తావీవు గాదె!
ఓడిపోను భక్తి యందునన్!యోగిగాను భోగ భూషణా!ఓలను నీసేవలోన!

అనిరుద్ఛందాంతర్గత""ఉత్కృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు10,19,అక్షరములకు చెల్లును.

12.గర్భగత"చాలిక"-వృత్తము.

ఏగినంత గొల్చినాసరే! ఎడమోమదేలో?శివా!ఏలిక నీ వాడ నేను!
సాగినంత శక్తి  నెంచెదన్!జడిపింప నేల?భద్రుడా!చాలు కటాక్షంబు నిమ్ము!
!భోగ భాగ్య మేల?నీదరిన్!పోడిమంబుపెంచు మోక్షపూదాలకు తావీవు గాదె
యోగిగాను భోగ భూషణా!ఓడిపోను భక్తియందునన్!ఓలను నీ సేవలోన!

అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"-ఛందములోనిది.
ప్రాసనియమమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు"10,18,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-నీవాడ"-వృత్తము.

ఎడమోమదేలనో?శివా!ఏలిక నీవాడ నేను!ఏగినంత గొల్చినా సరే!
జడిపించ నేల?భద్రుడా!చాలు కటాక్షంబు నిమ్మ!సాగినంత శక్తి వేడెదన్!
పోడిమంబు పెంచు మోక్షదా!పూలకు తావీవుగాదె!భోగ భాగ్య మేల?నీదరిన్
ఓడిపోను భక్తి యందునన్!ఓలను నీ సేవలోన!యోగిగాను భోగభూషణా!

అనిర్ద్ఛందాంతర్గత"ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-ఏగినంత"-వృత్తము.

ఏలిక నీవాడ నేను!ఏగినంత గొల్చినా సరే!ఎడమో మదేలనో?శివా!
చాలు కటాక్షంబు నిమ్ము!సాగినంత శక్తి నెంచెదన్!జడిపించనేల?భద్రుడా!
పూలకు తావీవు గాదె!భోగ భాగ్యమేల?నీదరిన్!పోడిమంబు పెంచు మోక్షదా!
ఓలను నీ సేవలోన!యోగిగాను భోగ భూషణా!ఓడిపోను భక్తియందునన్!

జైహింద్

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.