జైశ్రీరామ్.
ఈడ,ఏడ,ఏలిక,పాలయ,తోడుకొను,తూలని భక్తి,పేలవ,పాడియైన,సౌరులు పాడుకొను,వీడజాల,పారద్రోలు,గీతిక,నావాడ,గర్భ"-పాలయమాం" వృత్తము
ఈడ నిన్ను గొల్చెదెన్నడున్!ఏడకేగినావు శంకరా!ఏలిక నావాడ వీవు!
పీడ లెల్ల ద్రోల రావయా!వీడజాల నిన్నుమా ధవా!పేలవమా నాదు భక్తి!
తోడు నీడ నీవె నా కయా!తోడుకొంటి భక్తి సౌ రుచుల్!తూలని నిస్వార్ధ చింత!
పాడియైన కోర్కె దీర్చవా!పాడుకొందు నీదు గీతికల్!పాలయమాం విశ్వ నాధ!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతియందలిఅనిర్ద్ఛందాంతర్గత"
ఛందములోనిది.ప్లాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు"10,19,అక్షరములకు చెల్లును.
1,గర్భగత"-ఈడ"-వృత్తము.
ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!
పీడ లెల్ల ద్రోల రావయా!
తోడు నీడ నీవె!నా కయా!
పాడియైన కోర్కె దీర్చవా!
అభిజ్ఞా ఛందాంతర్గత బృహతీ ఛందమునందలిది.
పాదమునకు "9"అక్షరములుండును.ప్రాసనియమము కలదు.
2.గర్భగత"-ఏడ"-వృత్తము.
ఏడ కేగి నావు శంకరా!
వీడ జాల నిన్నుమా ధవా!
తోడు కొంటి భక్తి సౌ రుచుల్!
పాడు కొందు నీదు గీతికల్!
అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరములుండును
3,గర్భగత"-ఏలిక"-వృత్తము.
ఏలిక నా వాడ వీవు!
పేలవమా!నాదు భక్తి!
తూలని నిస్వార్ధ చింత!
పాలయమాం విశ్వ నాధ!
అభిజ్ఞా ఛందమునందలి"అనుష్టుప్ఛందములోని
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరములుండును
4.గర్భగత"-పాలయ"-వృత్తము.
ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!ఏడ కేగి నావు శంకరా!
పీడ లెల్ల ద్రోల రావయా!వీడ జాల నిన్నుమా ధవా!
తోడు నీడ నీవె!నా కయా!తోడు కొంటి భక్తి సౌ రుచుల్!
పాడియైన కోర్కె దీర్చవా!పాడు కొందు నీదు గీతికల్!
అణిమా ఛందము నందలి"-ధెతి"-ఛందములోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"-10,వ యక్షరమునకు చెల్లును.
5,గర్భగత"-తోడు కొను"-వృత్తము.
ఏడ కేగి నావు శంకరా!ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!
వీడ జాల నిన్నుమా ధవా!పీడ లెల్ల ద్రోల రావయా!
తోడు కొంటి భక్తి సౌ రుచుల్!తోడు నీడ నీవె!నాకయా!
పాడు కొందు నీదు గీతికల్!పాడియైన కోర్కె దీర్చవా!
అణిమా ఛందమునందలి"ధృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,"అక్షరములుండు
యతి"10"వ యక్షరమునకు చెల్లును.
6,గర్భగత"-తూలని భక్తి,"వృత్తము
ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!ఏలిక నా వాడ వీవు!
పీడ లెల్ల ద్రోల రావయా!పేలవమా!నాదు భక్తి!
తోడు నీడ నీవె!నా కయా!తూలని నిస్వార్ధ చింత!
పాడి యైన కోర్కె దీర్చవా!పాలయమాం!విశ్వ నాథ!
అణిమాఛందమునందలి"-అత్యష్టి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండు
యతి..10"వయక్షరమునకు చెల్లును.
7,గర్భగత"-పేలవ"-వృత్తము.
ఏలిక నావాడ వీవు!ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!
పేలవమా!నాదు భక్తి!పీడ లెల్ల ద్రోల రావయా!
తూలని నిసవార్ధ చింత!తోడు నీడ నీవె!నాకయా!
పాలయమాం!విశ్వ నాథ!పాడియైన కోర్కె దీర్చవా!
అణిమా ఛందమునందలి"-అత్యష్టి"-ఛందములో
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండు
యతి"9"వ యక్షరమునకు చెల్లును.
8,గర్భగత"-పాడియైన"-వృత్తము.
ఏడ కేగినావు శంశరా!ఏలిక నావాడ వీవు!
వీడ జాల నిన్నుమా ధవా!పేలవమా!నాదు భక్తి!
తోడు కొంటి భక్తి సౌరుచుల్!తూలని నిస్వార్ధ చింత!
పాడు కొందు నీదు గీతికల్!పాలయమాం!విశ్వ నాథ!
అణిమా ఛందమునందలి"అత్యష్టి"-ఛందములోని
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండు
యతి"10"వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"-సౌరులు"-వృత్తము.
ఏలిక నావాడ వీవు!ఏడ కేగి నావు శంకరా!
పేలవమా!నాదు భక్తి!వీడ జాల నిన్నుమా ధవా!
తూలని నిస్వార్ధ చింత!తోడు కొంటి భక్తి సౌరుచుల్!
పాలయమాం!విశ్వ నాథ!పాడు కొందు నీదు గీతికల్!
అణిమాఛందము నందలి "అత్యష్టి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"-9;వయక్షరమునకు చెల్లును.
10,గర్భగత"పాడుకొను"-వృత్తము.
ఏడ కేగి నావు శంకరా!ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!ఏలిక నావాడ వీవు!
వీడ జాల నిన్నుమా ధవా!పీడలెల్ల ద్రోల రావయా!పేలవమా!నాదుభక్తి!
తోడు కొంటి భక్తి సౌరుచుల్!తోడు నీడ నీవె నాకయా!తూలని నిస్వార్ధ చింత!
పాడు కొందు నీదు గీతికల్!పాడియైన కోర్కె దీర్చవా!పాలయమాం!విశ్వనాథ!
అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"-ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుడును
యతులు"10,19,అక్షరములకు చెల్లును.
11"గర్భగత"-వీడజాల"-వృత్తము.
ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!ఏలిక నా వాడ వీవు!ఏడ కేగి నావు శంకరా!
పీడ లెల్ల ద్రోల రావయా!పేలవమా!నాదు భక్తి!వీడ జాల నిన్నుమా ధవా!
తోడు నీడ నీవె నా కయా!తూలని నిస్వార్ధ చింత!తోడుకొంటి భక్తి సౌ రుచుల్!
పాడియైన కోర్కె దీర్చవాతూలని నిస్వార్ధ చింత!పాడ్కొందు నీదు గీతికల్!
అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"-ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండు
యతులు"10,18"అక్షరములకు చెల్లును.
12.గర్భగత"-పారద్రోలు"-వృత్తము.
ఏలిక నావాడ వీవు!ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!ఏడ కేగినావు శంకరా!
పేలవమా!నాదు భక్తి!పీడ లెల్ల ద్రోల రావయా!వీడజాల నిన్నమా ధవా!
తూలని నిస్వార్ధ చింత!తోడు నీడ నీవె నాకయా!తోడుకొంటి భక్తి సౌ రుచుల్!
పాలయమాం!విశ్వనాథ!పాడియైన కోర్కె దీర్చవా!పాడుకొందు నీదు గీతికల్!
అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"-ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండు
యతులు"9,18,యక్షరములకు చెల్లును.
13.గర్భగత"-గీతిక"-వృత్తము.
ఏడ కేగి నావు శంకరా!ఏలిక నావాడ వీవు!ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!
వీడ జాల నిన్నుమా ధవా!పేలవమా!నాదు భక్తి!పీడలెల్ల ద్రోల రావయా!
తోడుకొంటి భక్తి సౌరుచుల్!తూలని నిస్వార్ధ చింత!తోడు నీడ నీవె!నాకయా!
పాడుకొందు నీదు గీతికల్!పాలయమాం!విశ్వ నాథ!పాడియైన కోర్కె దీర్చవా!
అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండు
యతులు"10'18,యక్షరములకు చెల్లును.
14,గర్భగత"-నావాడ"-వృత్తము.
ఏలిక నావాడ వీవు!ఏడ కేగినావు శంకరా!ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!
పేలవమా!నాదు భక్తి!వీడజాల నిన్నుమా ధవా!పీడలెల్ల ద్రోల రావయా!
తూలని నిస్వార్ధ చింత!తోడుకొంటి భక్తి సౌ రుచుల్!తోడు నీడ నీనె నాకయా!
పాలయమాం!విశ్వనాథ!పాడుకొందు నీదు గీతికల్!పాడియైన కోర్కె దీర్చవా!
అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండు
యతులు"-9'18"అక్షరములకు చెల్లును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.