గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఫిబ్రవరి 2022, ఆదివారం

యః సర్వత్రానభిస్నేహః.. || 2.57 || ..//..యదా సంహరతే చాయం.. || 2.58 || ..//..సాంఖ్య యోగము.

 జైశ్రీరామ్.

శ్లో.  యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ |

నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 57

తే.గీ.  మోహ దూరుఁ డగుచు స్నేహమున్ వ్యామోహ

మును మిడుచునెవండు మనుచునుండి,

చను శుభాశుభముల సంతసంబును ద్వేష

ముందడతనిప్రజ్ణ యలరు భువిని.

భావము.

స్నేహవ్యామోహాలు లేకుండా వ్యవహరిస్తూ శుభాశుభాలు కలిగినప్పుడు 

సంతోషం, ద్వేషం పొందకుండా వుండేవాడు స్థితప్రజ్ఞుడు.

శ్లో.  యదా సంహరతే చాయం కూర్మో௨0గానీవ సర్వశః |

ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 58

తే.గీ.  కూర్మ మవయవములు ముడ్చుకొనునటులుగ

విషయ సంసక్త మతిని తా వేరు చేసి,

మెలగువాని ప్రజ్ణ మేలగు గుర్తింపు

పొంది మహిత సుఖము లోందు పార్థ!

భావము.

తాబేలు తన అవయవాలను లోపలికి ఎలా ముడుచుకుంటుందో 

అలాగే ఇంద్రియాలను సర్వవిధాల విషయసుఖాలనుంచి మళ్ళించిన 

వాడు  స్థితప్రజ్ఞుడవుతాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.