గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఫిబ్రవరి 2022, మంగళవారం

తస్మాద్యస్య మహాబాహో !..//.. || 2 . 68 || ..//..యా నిశా సర్వభూతానాం..//.. || 2 . 69 || ..//..సాంఖ్య యోగము.

 జైశ్రీరామ్.

శ్లో. తస్మాద్యస్య మహాబాహో ! నిగృహీతాని సర్వశః |

ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 68

తే.గీ. కావునర్జునా! విషయ సుఖముల దెసకు

వెళ్ళఁ బోవకే, యింద్రియ విజయుఁడయిన 

బుద్ధి వికసించు దానిచే పూర్ణమయిన

ప్రజ్ఞతో వెల్గగల్గును పార్థ! కనుము.

భావము.

అర్జునా ! అందువల్ల విషయసుఖాల వైపుకు వెళ్ళకుండా ఇంద్రియాలను 

నిగ్రహించుకున్నవాడికి స్థిరమైన బుద్ధి కలుగుతుంది; వాడే స్థితప్రజ్ఞుడు.

శ్లో. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ |

యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః || 69

తే.గీ. ఆత్మతోననుభూతిలేనట్టిప్రాణి

కోటికదిరాత్రి యోగులకు పగలదియె,

విషయలంపటులకుపవల్  విజ్ఞులయిన

యోగుల కదియె రాత్రి సద్యోగ వేళ.

భావము.

ఆత్మానుభూతిలేని అన్ని ప్రాణులకూ రాత్రిగాతోచే సమయంలో 

మనోనిగ్రహం  కలిగిన ముని మేలుకుని వుంటాడు. విషయాలపట్ల 

ఆసక్తితో సర్వప్రాణులూ మెలకువగా వున్నపుడు ఆత్మనిష్ఠ కలిగిన యోగికి 

రాత్రి అవుతుంది.

జైహ్గింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.