జైశ్రీరామ్.
శ్రీ భగవానువాచ:
శ్రీకృష్ణ భగవానుఁడనుచున్నాడు.
శ్లో. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే || 55
తే.గీ. మనసు లోపలి కోరికల్ మనుజుఁడెవడు
విడిచిపెట్టుచు భువిపైన వెలుగుచుండు
కన స్థితప్రజ్ట్ణుఁడతఁడెయౌ కనుము మదిని,
కని స్థితప్రజ్ణుడై వెల్గుఘనతరముగ.
భావము.
మనసులోని కోరికలన్నిటినీ విడిచిపెట్టి, ఎప్పుడూ ఆత్మానందమే
అనుభవించేవాడు స్థితప్రజ్ఞుడు.
శ్లో. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే || 56
తే.గీ. కష్ట సమయంబులందునఁ గలత పడక,
సుఖములందున పొంగక శోభనొప్పు
సతము విగతరాగద్వేషు డతులిత మతి
స్థిర శుభమతిని మునియందు రరయుమయ్య.
భావము.
దుఃఖాలకు క్రుంగనివాడూ, సుఖాలకు పొంగనివాడూ, భయమూ,
రాగద్వేషాలూ వదిలిపెట్టినవాడూ అయిన మునీంద్రుడు
స్థితప్రజ్ఞుడవుతాడు.
జైహింద్.
Print this post
వ్రాసినది












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.