గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఫిబ్రవరి 2022, శనివారం

తాని సర్వాణి సంయమ్య.. || 2 . 61 || ..//..ధ్యాయతో విషయాన్ పుంసః .. || 2 . 62 || ..//..క్రోధాద్భవతి సమ్మోహః .. || 2 . 63 || ..//..సాంఖ్య యోగము.

 జైశ్రీరామ్.

శ్లో.  తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |

వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 61

తే.గీ. యోగ సాధకుఁడు జితేంద్రియుఁడగుచు నను

మనసులో నిండుగా నింపి మసలవలయు,

నప్పు డాతనిప్రజ్ణ మహాద్భుతముగ

సుస్థిరంబగు,నో పార్థ! శుభకరమగు. 

భావము.                                                                                                                

యోగసాధకుడు ఇంద్రియాలన్నింటినీ వశపరచుకుని నామీదే మనస్సు 

వుంచాలి. అలాంటివాడి ప్రజ్ఞ సుస్థిరమవుతుంది.

శ్లో.  ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే |

సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో௨భిజాయతే || 62

తే.గీ. ఇంద్రియార్థంబులాశింప నెన్నఁజాల

నట్టి యాసక్తి పుట్టి మోహంబుకలిగి

కోరికలుపుట్టు నందుచేఁ గోపమొదవు

నర్జునా! గ్రహియింపు మనుపమముగ. 

భావము. ఎప్పుడూ శబ్దాది విషయాల గురించే ఆలోచించే వాడికి 

వాటిమీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తివల్ల కోరికలు పుడతాయి. 

కోరికలు కోపం కలగజేస్తాయి. 

శ్లో.  క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః |

స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి || 63

తే.గీ. కోపమునఁగల్గు సమ్మోహమోపనంత,

మసలు దానిచే స్మృతివిభ్రమంబు కలుగు,

బుద్ధియు నశించు దానిచేపూర్తిగాను,

బుద్ధి నశియింప పతనమ్మె పొందు తుదకు.

భావము.


కోపం
మూలంగా అవివేకం కలుగుతుంది. అవివేకంవల్ల మరపు

మరపువల్ల  బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం 

జరుగుతుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.