గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, అక్టోబర్ 2020, గురువారం

శ్రీ షడాననా! ... పద్య త్రయము....రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
శ్రీ షడాననా!
నిత్యము శత్రుషట్కము మనీషులనైనను క్రుంగదీయు నౌ
న్నత్యమువీడఁ జేసి సుజనాళిని దుర్జనపాళిం జేయు, నే
నిత్యము నిన్ స్మరించి మహనీయుఁడ నీవిక శత్రుషట్కమున్
మృత్యువు పాలు చేయమని మేలు భజించుదు శ్రీషడాననా!

కాలము దాటిపోవుచును కాచును పోయెడివారికోసమై,
శ్రీలను గొల్పు కొందరికి  శ్రీలు నశింపఁగ జేసి దుర్గతిన్
కాలమె మూలమై కొలుపు, కామిత సద్వర దాతవీవు మ
మ్మేల గణింప రావు? తరమే నిను వీడుట, శ్రీ షడాననా!

రోగములంతుపట్టనివి రోజుకు రోజుకు వృద్ధియౌచు స
ద్యోగముతో చరించు  గుణయుక్తులనైనను పట్టుచుండి దు
ర్యోగము పాలు చేతుచు నయోమయమున్ కలిగించుచుండె సద్

వేగమె వచ్చి పాపుమిక విస్త్రుత రోగము శ్రీ షడాననా!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.