జైశ్రీరామ్.
౧. ఓం శ్రీమాత్రే నమః.
శా. శ్రీమన్మంగళ దేవతా! శుభతతిన్ శీఘ్రంబుగా గొల్పు, మా
శ్రీమాతా! వర పద్మపాద, దయతో
జేకొమ్మ నీ భ్గక్తులన్,
ప్రేమోద్భాస
ముఖారవింద జననీ విజ్ఞానదానప్రియా!
నీమంబొప్పగ
నిన్నుఁ గొల్తుము సదా నీ సత్ కృపన్ బ్రోవుమా.
౨. ఓం మహారాజ్ఞ్యై నమః.
తే.గీ. ప్రాణులను కాచు శ్రీమహారాజ్ఞివమ్మ,
జ్ఞాన
సంపత్తియే నిన్ను గనగ జేయు,
కలుగఁ
జేయుము మాకది కనగ నిన్ను,
వందనములందుకొనుమమ్మ
భక్తసులభ.
౩. ఓం
శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.
కం. శ్రీమత్ పంచ దిగానన!
ధీమంతులుగా
జనులను తీర్చుము తల్లీ!
ప్రేమన్
మము గరుణించెడి
శ్రీమత్
సింహాసనేశ్వరీ! వందనముల్.
౪. ఓం చిదగ్నికుండ సంభూతాయైనమః.
ఉ. మాత చిదగ్ని సంభవ సమంచిత ధీ వర తేజ! నీవు వి
ఖ్యాతిగ తామసమ్మును ప్రకాశము చేత నశింపఁ జేసి, మా
కాతత
భక్తినిచ్చెద వనంత దయాబ్ధి! చిదగ్నికుండ సం
భూత! నమస్కరించెదము, బోధను
గొల్పి రహింపఁ జేయుమా.
౫. ఓం దేవకార్య
సముద్యతాయై నమః.
మత్త
కో. దేవకార్యము తీర్చగా గణుతింప పృథ్వి
జనింతువా,
కావగా
సుజనాళి నంచిత గౌరవంబును గొల్పుచున్,
జీవ
కోటిని కాచు తల్లివి చేర రమ్మిక బ్రోవ నన్
దేవకార్య
సముద్యతా!
వర దీక్షతో నిను గొల్చెదన్.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.