గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జులై 2020, మంగళవారం

శ్రీవిశాఖ పట్నము(జిల్లా),చోడవరము(మం).జుత్తాడ గ్రామ విశిష్టత,రచన:-శ్రీ వల్లభవఝల శ్రీరామ చంద్ర మూర్తి.

జైశ్రీరామ్.
శ్రీవిశాఖ పట్నము(జిల్లా),చోడవరము(మం).జుత్తాడ గ్రామ మందలి అతిపురాతన శ్రీ,శ్రీ,శ్రీ,ఉమా మల్లేశ్వర స్వామి                 వారి,ఆలయ,గ్రామముయొక్కవిశిష్టత,రచన:-వల్లభవఝల శ్రీరామ చంద్ర మూర్తి.  చోడవరము..                         

1.తే.గీ:-మల్లి నాథుని సేవించి మహిమ లలర
శారదా నది కంఠహారమై సరగె పురిని
ప్రజకు భగవంతు సేవించు భాగ్య మమరె
అరయ జుత్తాడ భువి యందు నపర కాశి!
2.తే.గీ:-దవళ లింగంబు బ్రహ్మ సూత్రంబు దనరె
కొంగు బంగార మౌచును కోర్కె దీర్చు
అమ్మ ఉమ తోడ వెల్గొంది యార్త జనుల
కాచి రక్షించు మల్లేశు కరుణ నెపుడు!
3.తే.గీ:-పట్టమాంబిక పట్టుగ ప్రజల నెల్ల
సర్వ శోభల పుర మెల్లచక్క గాచి
కరువు కాటక మిచ్చట కనగ నీక
పసిడి పంటల శోభల వరల గాచు!
4.తే.గీ;-సిరి వరామ విశాఖ నా జిల్ల యందు
చోడవర దరి జుత్తాడ శుభగ సీమ
శివుడు,కేశవు లిరువురు సిరులు పంచ
భూతలపు స్వర్గ!కైలాశ భ్రాంతి గొల్పె!
5.తే.గీ:-బ్రహ్మ సూత్రము వెలిగెడు భాను తేజ
మూడు నామాలు నిలువుగ మురిపె మొలుక!
బ్రహ్మ చారిక లున్నట్టి పావన హర
ముగ్ధ మోహన మమ్మేలు మోహనాంగ!
6.తే,గీ:-వక్ర తుండుడు వెలసెను వరదు డగుచు
తొమ్మి దడుగులు!తోరపు టుదర మమర
మంద హాసము చిందించి మముల గావ
మహిత భక్తిని పూజించు భాగ్య మమరె!
7తే.గీ:-సఖులు శ్రీదేవి భుదేవి సహితుడగుచు
ఏక శిలపైన వెలసిన !వేంకటేశు
దేవళమ్మును నిర్మించె దివిజ వరులు
భక్త జనులను బ్రోవంగ వసుథ యందు!
8.ఆ.వె:-భువిని పుట్టు జనులు పుణ్యంబు నందగ
ఇటను అటను తిరుగ నేమి ఫలము?
ఒక్కసారి దీని చక్కగ గాంచిన
పుణ్యగతులు కలుగు పూర్ణ ముగను!
9.తే.గీ:-మత్స్య వంశీయు లేలిన మాన్య సీమ
చిహ్న ములు దేవళంబుల చెక్కి నారు
అట్టి ఱుత్తాడ జుత్తాడ యనిరి నేడు
భక్తి కీర్తంప మోక్షంబు  బరగు నిజము!

స్వస్తి
శ్రీరామచంద్ర మూర్తి.
చోడవరము.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.