జైశ్రీరామ్
నీతినడుమా"-శీర్షికన"----చతుర్వింశతి"- రత్న మాలికా
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
1. రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
.ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగి నేల లక్ష్య పెట్టకన్!నీతి నాతి మూతి మూయుచున్!
పంగ నామ ధోరణిం జనన్!పాతి పెట్టి సామ్య వాదమున్!
మంగళంబు జాతి నంటగన్?మాత ఖ్యాతి మట్టు పెట్టుచున్!
గంగ మాంబ వల్లభా! హరా! ఘాతు కాళి చూచు చుంటివే?
2.రజినీకర ప్రియవృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రౌతు బట్టి గుఱ్ఱమో!యనన్?వ్రాత బట్టి జీవ మొప్పదే?
పాత నీతి గాన దాయెనే?వాత రోగ మావరించె నే?
నీతి నిండు భక్తి గావలెన్?నీ తపంబు మెచ్చుకో లవన్?
శీత, వాత ధాత్రి నిత్యమై!చేతలందు నిండు మేలునన్!
3.చూడరయా"-వృత్తము.
కృతిఛందము.భ.స.జ.త.స.ర.లగ.యతి.11,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాడు తలపు టూహ గాములై!వాడి వేడి దూషితంబులన్!
నీడ నెడము జేసి మాపగా?నీడ వీవె?కావు దైవమా!
గాడి విడిచె స్వార్థ చింతనన్!కాడి వీడ పంట పండునే?
చూడ మరచి నాడవా!శివా!చూడు ధాత్రి శాంతి నిండవన్?
4.పురోగమా"-వృత్తము.
అతిధృతి ఛందము.జ.త.ర.జ.ర.జ.గ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరాన్నభు గ్జీవితంబులన్!పరోపకార బుద్ధి లేదయెన్?
పరార్థమే!గాన రాదయెన్?వరాశ కంతు కానదాయెనే!
స్థిరంబు లేదాయె!మాటకున్!చిరాకు నొందవేల?శూలివై!
పురోగమం బేది?చూడగన్!పురాంతకా!జపంబు జేతు నిన్!
5.నిరోధినీ"-వృత్తము.
అతి ధృతి ఛందము.జ.ర.జ.భ.స.జ.గ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరోన'-నైన లెక్క జేయకన్?కలిసి జీవించు తీరయెన్?
దురాశ పాశ బద్ధ మాయెనే!తులకు రానట్టి చర్యలన్!
నిరోధ మాప శక్తి జాలకన్?నెలకొనెన్!ధైర్యమింతయే?
సురాధినాథ చూడు చర్యలన్!సులభమా!జీవితంబులున్?
6.మాయవీడు"-వృత్తము.
అతిధృతి ఛందము.ర.జ.ర.న.ర.జ.గ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తల్లి'దండ్రి, దైవ భక్తియే?ధరను బ్రోచు నీతి మార్గతన్!
చెల్లు లోక తీరు నైజమై!చెరిగి పోదు ఖ్యాత దెన్నడున్?
మెల్లనైన మాట తీరునన్?మెరసిపోవు జన్మ కాంతినిన్?
కల్లబొల్లి మాయ వీడుచో?కరము నీతి నిల్చు ధాత్రినిన్!
7.తాడినీ"-వృత్తము.
అతిధృతిఛందము.ర.న.జ.త.ర.జ.గ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాడు బుద్ధి విడిచి యొప్పుమా!భావ పూర్ణ తేజ మందుమా!
చూడు సాటి జనుల దైవమున్!సూవె నీవు జ్యోతి లోకమున్!
మాడ మేడ లనకు స్వార్థతన్!మా'-విశేష కీర్తి వాటిలున్!
తాడి నీడ తులవు గాకుమా?తావకంబు నెంచు సర్వదా!
8.నీతదే?"-వృత్తము.
ధృతిఛందము.న.న.భ.భ.జ.ర.గణములు.యతి.11.వ.యక్షరము.
గరికె తినెడి గాడిదయే?కనులు మూయు నేస్తమా!
గరికె మొలచు చావదులే?కనుము నీత దేనురా?
పిరికి! జనుడు భూతలిన్?వినును శూన్య చేతనన్!
పెరక వలదు నీతి నిలన్?పెనుగులాడి దోషివై!
9.నిల్వని"-వృత్తము.
కృతిఛందము.ర.స.జ.భ.న.స.లగ,గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చావు పుట్టుక లిక్క డేను లే!సమత మమతలు పెంచుమా!
నీవు నీవుగ!నిల్వ లేకనే? నిమిరి కులమను మాటలన్!
చావు దెబ్బను తీతు వేలన్?శమము గనకను ద్వేషతన్!
బావు కొందువె?జీవితాంతమ్!భములు కలుగును తధ్యమున్!
10,రోధ ఘోషణా"-వృత్తము.
ప్రకృతిఛందము.స.స.జ.భ.న.జ.ర.గణములు.యతి.11.వయక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చెడు కర్మలు కోరి జేయుచున్!చెడును కలికి'-నంట జేతువా!
విడ నేరని స్వార్థ చింతనన్?విడువ బడని స్వా పరంబులన్!
దడ గల్గెను మాత గుండెలున్!తడిసె నెడద నశ్రు ధారలన్!
విడునే?గ్రహణంబు!యోచిలన్!పిడికిలి బిగియించు దైవమా!
11.తిలకమా"-వృత్తము.
అతిజగతీ ఛందము.ర.జ.న.త.గ.గణములు.యతి.7,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్న మాటలాడ ఉలికి పాటేలనో?
తిన్నదింక చాలు! తిలకమై నిల్వుమా!
మన్ననంబు నొంద మలుచుకో!లోకమున్!
చెన్ను నొందు మయ్య!చెలిమినిం!దేశమున్!
12.రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తోలు బొమ్మలాట జీవితమ్!తూలిపోకు నిచ్ఛ మీరగన్
మేలుకొల్పు మానవాళినిన్!మేలనంగ?జాతి మెచ్చగన్!
నీలి మబ్బు వాన తీరునన్!నేల పాడి పంట లొప్పగన్!
జాల మేలు తెల్వి తేటలన్?చాలు నింక వక్ర భాషణల్!
13.యతిర్నవ సుగంథి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కర్మజీవి మానవుండు!కర్మ మాను చర్య దోషమౌ?
ధర్మ మేది?రూకలీయ!తర్మివేయు!నీతి చేతనన్!
దుర్మదంబు పెచ్చు పెర్గు!తుర్మి వేయుశక్తి యుక్తులన్!
వర్మణీయ మౌను బుద్ధి!పర్ము దుర్బలంబు నిండునన్!
వర్ణీయమౌను బుద్ధి=బుద్ధియనుదానిని కదలనీయని కవచమౌను,
14.సంఘీభావ వృత్తము.
కృతిఛందము.న.ర.జ.త.న.ర.లగ.గణములు.యతి.11,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సమ సమాజ స్థాపనమ్ము నన్!చక్క బరచు లోక కీర్తినిన్!
భముల నొందు వారి కావుమీ!బక్క జనుల బాగు చూడుమా!
నిముర బోకు?పాపి మూకలన్!నిక్క మిలను నీతి నిల్పుమా!
తమము వీడి!శాంతి నాశిలన్?దక్కు పరమభోగ భాగ్యముల్!
15.సౌహార్ధతా"-వృత్తము.
కృతిఛందము.న.భ.భ.య.జ.జ.గగ.గణములు.యతి.12.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలిని'-కర్ములు కర్త లవగా!గౌరవం బది?కుంఠి దాయెన్?
నిలువ దాయెను నీతి జగతిన్!నీరు గారెను ధర్మ మార్గమ్!
తులువ చైదపు చేష్ట లలమెన్!దూర మాయెను భక్తి తత్వమ్!
చెలువ మేదియు?గాన దాయెన్!చీరె సఖ్యత!కల్మి దంష్ట్రల్!
16.ఆరనీకుమా"-వృత్తము.
అతిధృతి ఛందము.భ.న.ర.త.భ.ర.గ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కర్తలకు భువి కర్మ పట్టెన్!కారణం బది!దోష చర్యే?
వర్తిలెను కలి ధర్మ మింతే?వారణంబును జేయ నౌనే?
భర్తలను!భ్రమ దేల్చి రింతే!భార మాయెను జీవ భ్రాంతుల్!
యార్తి జనులను బ్రోవ రండీ!ఆరనీకుడి?పూజ్య భావమ్!
భర్తలను=పతులను,ఏలికలను,
17.భేదిల్లు"-వృత్తము.
అతిధృతి ఛందము.ర.స.జ.జ.భ.ర.గ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నాది నాదను మాట!స్వార్థము! నాదనే దిల లేనె లేదే?
మాది మాదని మాతృ శోభను!మాధవుం డిల మెచ్చి తీరున్!
బీద సాదల నుద్ధ రించిన! భేదిలం బడ దెంచ?ధర్మమ్!
వాదనంబులు కట్టి పెట్టుడి!పాదులై భువి కీర్తి నిల్పన్?
18.ధీరవాచా"-వృత్తము.
కృతిఛందము.ర.స.య.న.భ.న.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తీరు లేక?న యాచితంబుల్!తినుట పాపము తెలిసి కొమ్మా!
కోరి స్వార్ధపు పంపకంబౌ?కొనుట దోషము పురుష సింహా!
నీఱు జేయకు?నీదు శక్తిన్!నిను యనాధగ దలచు టే లే?
పౌరుషంబున!స్వార్జి తంబే!వనథి ధీరత నిలుపు నీతిన్!
19,జీనివీవ"-వృత్తము.
అతిధృతిఛందము.ర.స.న.త.భ.ర.గ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దాన కర్ణులు లేరు?కలిలోన్!దాన మీయగ!పోషిలంగన్!
మేన బ్రాణము దాల్చు దనుకన్?మీన మేషపు లెక్క లేలన్?
చేను మేసెడి కంచె తులనౌ?జీని వౌదువు!నుల్కు లేకన్?
మానుషంబును వీడ?దొసగౌ!మానుకొమ్మిక!యాచ నంబున్?
అర్థములు:-
జీనివౌదువు=ఉలుకు పలుకు లేని బొమ్మ(శిల),దొసగౌ=తప్పు అగును.
20,రసయాద్వయ"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.ర.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
బీద యెవ్వడు?లోకమందున్?భేద భావమె?కూర్చె ముష్టిన్?
చీదరించకు?సాటి వారిన్?చేదు తీపగు?పెంచు మంచిన్?
క్రోధ ద్వేషము లేల?జీవా!క్రోధిలం గడు నైచ్య మేలే?
మోదమందుము!సామ్య వాదీ!మోదిలందగు?జీవితాంతమ్!
21.బుద్ధ్యాత్మనా"-వృత్తము.
కృతిఛందము.న.ర.జ.త.భ.స.లగ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అరి షడాదు లంట నీకుమా!ఆత్మ,బుద్ధి వశము జేయుచున్?
పరమ నిష్ఠ కర్మ జేయుమా!వాత శీత వశిత జీవితమ్!
చిరము దాటు యోగ నిష్ట చేన్!చిన్మయంపు సొబగు గూర్చుమా!
వర మయూఖ కాంతి భాసిలన్?భావ జారి సుర వరాముడా!
22.సౌందర్యమ"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.ర.భ.త.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అన్నుల మిన్నీవు దైవమా!అన్నిట నీవుందు వందురే?
కన్నుల నీ రూపు గాంచగా!కానవే మయ్య?శ్రీ హరీ!
చెన్నగు సౌందర్య రూపమా!చిన్ని కృష్ణుండ వేవెగా!
దన్ను నా కీవె! నమ్ముమా!దండములం గొంచు గావుమా!
23.వెసగొను"-వృత్తము.
కృతిఛందము.న.న.ర.జ.ర.ర.లగ.గణములు.యతి.12,వ.యక్షరము.
ప్రాసనియమభు కలదు.వృ.సం.
దొసగు పొసగు కర్మ జీవులన్?దురాశ!తార స్థాయి జేర్తువే!
విసుగు కనవు దోష చర్యలన్!వినాశ మెంచ తొంద రొందవే?
వెసను గొనెదు స్థాయి మీరినన్!బిరాన గూల్తు విశ్వ రక్షకా!
వశివి యగుదు!భక్త యోగికిన్!విశేష శక్తి!లీన మేర్తువే?
24.నయాకర"-వృత్తము.
అతిధృతిఛందము,న.న.ర.న.య.జ.గ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సచివులు సలహాలు మాని!స్వయముగా! రాజ్య మేలగన్?
వచితములకు లోటు రాదు!పయనమే రీతి?నేగునో?
సచరితము కనంగ నౌనొ?సు యశమో?వేచి చూడుడీ!
పచనము రుచి దైవమెంచు!భయపడం!లాభ మౌ నొకో?
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.