గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, నవంబర్ 2019, బుధవారం

శ్రీ పూసపాటి కృష్ణ సూర్యకుమార్ విరచిత రథ, చతుతంగ బంధ పద్యములు.

జైశ్రీరామ్
శ్రీ పూసపాటి కృష్ణ సూర్యకుమార్ విరచిత

1)   గణేష స్తుతి     (రధ బంధ సీసము)
శం , శాంకరి కొమరా! చంద్ర చూడ శుభ తనయ! బొజ్జ దేవర!, నాగ సూత్ర
ధర! వారణంపు వదన! నిత్య మోదక వాంఛితా! పరమేష్టి  భావుక! గణ
నాధా!ఎలుక వాహనా!,కుమారాగ్రజా!  విల సితంపు వదనా!, విఘ్న రాజ!
 సుప్ర దీపుండ! శుభ ప్రదా! జిష్ణుడ! యేకదంతా! సర్వలోక నాధ!,

చదిర వీక్షితా!  భువిజన సమ్మతి విత
రణ! శుభ ప్రదాత!వ్యాస భారత విధాత!
యెపుడు కాంచుచు,తప్పుల నెప్పుడు క్షమ
చూపి దీనుల బాధలు బాపు మయ్య.
                                                          పూసపాటి కృష్ణ సూర్యకుమార్


2 చతురంగ బంధ సీస పార్వతీ ప్రార్ధన

నగజాత! యాదవి! నగనందిని!గిరిజ!
                 అంబిక! అద్రిజ!,యమున! నాగ
హారుని దేవేరి!ఆదిశక్తి! అనంత!
          మలయ నివాసిని!మాత!సౌమ్య!
చేతన సఖి!గట్టుధీత! నగపు సూన!
          శరవణ భవమాత! సర్వలోక
సేవితా!శారదా! శివసత్తి! మాలినీ!
          దక్ష తనూభవ! దాక్షి! సింహ
యాన! శ్రీ నీల లోహిత! అగజ!హిమజ!
అజిత! సాప్తపదీన జాయ!  జితి  సహిత!
వాజస సహధర్మ చరిణీ! భవ్య! శ్రీ గ
జాన నోల్ల!  ఘనంబుగా సంతు గోరి
(సింహ వాహినీ నీ సేవ  చేసినాము)
 స్వస్తి.
శ్రీ పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గారికి అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.