జైశ్రీరామ్.
రసాంఘ్రి,మత్తరజినీ,ఉపమా,ససమా,లోకతీరు,ధూమక,చెరపు,ప్రతీక,కేశినీ,హైన్యతా,గర్భ"-మహేంద్ర"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-మహేంద్ర"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.మ.జ.ర.జ.న.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చెడుటూహల చైదాలన్!చేతనాల!మోసపూర్ణతన్!చెరుప ఘనుల ఖ్యాతినిన్
పడనేలను?పాపాలన్!పాతకాల హీనదుస్థితిన్! పరువు నిలువ దెన్నడున్?
కడు స్వార్థము కాటేయున్!ఘాతుకాన నిల్వబోకుమా!కరటుతనము మానుమా!
గడి మీరకు!ద్రోహాత్మన్!కౌతుకాన!ముక్తి కోరుమా!కరము సురల ధ్యానివై?
1.గర్భగత"-రసాంఘ్రి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.స.గగ.గణములు.వృ.సం.28,
ప్రాసనియమము కలదు.
చెడుటూహల చైదాలన్!
పడనేలను?పాపాలన్!
కడు స్వార్ధము కాజేయున్!
గడి మీరకు!ద్రోహాత్మన్!
2.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
చేతనాల మోస పూర్ణతన్!
పాతకాల హీన దుస్థితిన్?
ఘాతుకాన నిల్వ బోకుమా!
కౌతుకాన ముక్తి కోరుమా!
3.గర్భగత"-ఉపమా"-వృత్తము.
బృహతీఛందము.న.న.ర.గణములు.వృ.సం.192.
ప్రాసనియమము కలదు.
చెరుప ఘనుల ఖ్యాతినిన్!
పరువు నిలువ దెన్నడున్?
కరటు తనము మానుమా!
కరము సురల ధ్యానివై!
4.గర్భగత"-ససమా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.మ.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చెడు టూహల చైదాలన్!చేతనాల మోస పూర్ణతన్?
పడ నేలను?పాపాలన్!పాతకాల హీన దుస్థితిన్?
కడు స్వార్ధము కాజేయున్!ఘాతుకాన నిల్వ బోకుమా?
గడి మీరకు ద్రోహాత్మన్!కౌతుకాన ముక్తి కోరుమా?
5.గర్భగత"-లోకతీరు"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.న.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేతనాల మోస పూర్ణతన్!చెరుప ఘనుల ఖ్యాతినిన్?
పాతకాల హీన దుస్థితిన్?పరువు నిలువ దెన్నడున్?
ఘాతు కాన!నిల్వ బోకుమా!కరటుతనము మానుమా!
కౌతుకాన!ముక్తి కోరుమా! కరము సురల ధ్యానతన్!
6.గర్భగత"-ధూమక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.న.ర.స.న.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేతనాల మోస పూర్ణతన్!చెరుప ఘనుల ఖ్యాతినిన్?చెడుటూహల చైదాలన్!
పాతకాల హీన దుస్థితిన్?పరువు నిలువ దెన్నడున్?పడ నేలను?పాపాలన్!
ఘాతు కాన నిల్వ బోకుమా!కరటు తనము మానుమా!కడు స్వార్ధము కాటేయున్!
కౌతుకాన ముక్తి కోరుమా!కరము సురల ధ్యానివై!గడి మీరకు ద్రోహాత్మన్!
7.గర్భగత"-చెరపు"-వృతము.
అత్యష్టీఛందము.న.న.ర.స.స.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చెరుప ఘనుల ఖ్యాతినిన్?చెడు టూహల చైదాలన్!
పరువు నిలువ దెన్నడున్?పడనేలను?పాపాలన్!
కరటు తనము మానుమా!కడు స్వార్ధము కాటేయున్?
కరము సురల ధ్యానివై!గడి మీరకు!ద్రోహాత్మన్!
8.గర్భగత"-ప్రతీక"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.ర.స.స.మసజ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చెరుప ఘనుల ఖ్యాతినిన్?చెడు టూహల చైదాలన్!చేతనాల మోసపూర్ణతన్!
పరువు నిలువ దెన్నడున్?పడ నేలను?పాపాలన్!పాతకాల హీన దుస్థితిన్?
కరటు తనము మానుమా!కడు స్వార్ధము కాటేయున్?ఘాతుకాన! నిల్వ బోకుమా?
కరము సురల ధ్యానివై!గడి మీరకు!ద్రోహాత్మన్!కౌతుకాన!ముక్తి కోరుమా!
9.గర్భగత"-కేశినీ"-వృత్తము
అత్యష్టీఛందము.ర.జ.ర.స.జ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేతనాల!మోస పూర్ణతన్!చెడు టూహల చైదాలన్!
పాతకాల!హీన దుస్థితిన్?పడ నేలను?పాపాలన్!
ఘాతుకాన!నిల్వ బోకుమా?కడు స్వార్ధము కాటేయున్?
కౌతు కాన!ముక్తి కోరుమా!గడిని మీరకు ద్రోహాత్మన్!
10,గర్భగత"-హైన్యతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.స.జ.త.న.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేతనాల మోస పూర్ణతన్!చెడుటూహల చైదాలన్!చెరుప ఘనులఖ్యాతినిన్!
పాతకాల హీన దుస్థితిన్?పడ నేలను?పాపాలన్!పరువు నిలువ దెన్నడున్?
ఘాతుకాన!నిల్వ బోకుమా?కడు స్వార్ధము కాటేయున్?కరటు తనము మానుమా!
కౌతుకాన!ముక్తి కోరుమా!గడి మీరకు ద్రోహాత్మన్!కరము సురల ధ్యానివై?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.