జైశ్రీరామ్.
పరంతపా,నీరజ,స్తుతి,ప్రతాపనా,సమతమరు,దొరకొను,చొనకు,కనుమా,వెంటరాని,త్రిభంగినీ,గర్భ"-కరమరుదౌ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ
"-కరమరుదౌ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.స.మ.న.జ.జ.స.భ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గతాను గతికా లోకానన్!కరమరుదౌ!నరజన్మ!కనుమా!కీర్తి ఘటింపన్!
గతించు వడి!కాలంబెంచన్!కరటును వీడి చరించు!కన!రారెవ్వరు వెంటన్!
స్తుతింపవలె!మోక్షంబందన్!దొరకొను సామ్యత నొప్పు!తునుమం రాదిల సత్యమ్!
ప్రతాపమున!శ్రీమంతానన్!పరముడు భక్తిని మెచ్చ!వనథివై!జను ధీరా!
1.గర్భగత"-పరంతపా"-వృత్తము.
బృహతీఛందము.జ.స.మ.గణములు.వృ.సం.30,
ప్రాసనియమము కలదు.
గతాను గతికా లోకానన్!
గతించు వడి కాలంబెంచన్!
స్తుతింప వలె!మోక్షంబందన్!
ప్రతాపమున!శ్రీమంతానన్!
2.గర్భగత"-నీరజ"-"-వృత్తము.
బృహతీఛందము.న.జ.జ.గణములు.వృ.సం.368.
ప్రాసనియమము కలదు.
కరమరుదౌ!నర జన్మ!
కరటును వీడి చరించు!
దొరకొను సామ్యత నొప్పు!
పరముడు భక్తిని మెచ్చ!
3.గర్భగత"-స్తుతి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.భ.గగ.గణములు.వృ.సం.52.
ప్రాసనియమము కలదు.
కనుమా!కీర్తి ఘటింపన్!
కన రారెవ్వరు వెంటన్!
తునుమం రాదిల సత్యమ్!
వనథీవై!జను ధీరా!
4.గర్భగత"-ప్రతాపనా"-వృత్తము.
ధృతిఛందము.జ.స.మ.న.జ.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గతాను గతికా లోకానన్!కర మరుదౌ!నర జన్మ!
గతించు వడి కాలంబెంచన్!కరటును వీడి చరించు!
స్తుతింప వలె!మోక్షంబందన్!దొరకొను సామ్యత నొప్పు!
ప్రతాపమున!శ్రీమంతానన్!పరముడు భక్తిని మెచ్చ!
5గర్భగత"-సమతమరు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.జ.స.భ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కర మరుదౌ!నర జన్మ!కనుమా!కీర్తి ఘటింపన్!
కరటును వీడి చరించు!కన రారెవ్వరు వెంటన్!
దొరకొను సామ్యత నొప్పు!తునుమంరాదిల సత్యమ్!
పరముడు భక్తిని మెచ్చ!వనథీవై!జను ధీరా!
6.గర్భగత"-దొరకొను"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.జ.స.భ.త.భ.య.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కర మరుదౌ!నరజన్మ!కనుమా!కీర్తి ఘటింపన్!గతాను గతికా!లోకానన్!
కరటును వీడి చరించు!కన!రారెవ్వరు వెంటన్!గతించు వడి!కాలంబెంచన్!
దొరకొను సామ్యత నొప్పు!తునుమం రాదిల సత్యమ్!స్తుతింప వలె!మోక్షం బందన్!
పరముడుభక్తిని మెచ్చ!వనథీవై!జను ధీరా!ప్రతాపమున!శ్రీమంతానన్!
7.గర్భగత"-చొనకు"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భత.భ.య.గగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కనుమా!కీర్తి ఘటింపన్!గతాను గతికా లోకానన్!
కన రారెవ్వరు వెంటన్!గతించువడి కాలంబెంచన్!
తునుమం రాదిల సత్యమ్!స్తుతింప వలె మోక్షంబందన్!
వనధీవై జనుథీరా!ప్రతాపమున శ్రీమంతానన్!
8.గర్భగత"-కనుమా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.త.భ.య.త.నభ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కనుమా!కీర్తిఘటింపన్!గతాను గతికా లోకానన్!కరమరుదౌ!నరజన్మ!
కన!రారెవ్వరు!వెంటన్!గతించు వడి!కాలంబెంచన్!కరటును వీడి చరించు!
తునుమం రాదిల సత్యమ్!స్తుతింప వలె!మోక్షంబందన్!దొరకొను సామ్యత నొప్పు!
వనథీవై జను థీరా!ప్రతాపమున శ్రీమంతానన్!పరముడు భక్తిని మెచ్చ!
9.గర్భగత"-వెంటరాని"-వృత్తము.
ధృతిఛందము.న.జ.జ.జ.స.మ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరమరుదౌ!నరజన్మ!గతాను గతికా!లోకానన్!
కరటును వీడి చరించు!గతించు వడి కాలంబెంచన్!
దొరకొను సామ్యత నొప్పు!స్తుతింప వలె!మోక్షంబందన్!
పరముడు భక్తిని మెచ్చ!ప్రతాపమున శ్రీమంతానన్!
10,గర్భగత"-త్రిభంగినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.జ.జ.స.మ.స.భ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కర మరుదౌ!నరజన్మ!గతాను గతికా లోకానన్!కనుమా!కీర్తి ఘటింపన్!
కరటును వీడి చరించు!గతించు వడి!కాలంబెంచన్!కన రారెవ్వరు వెంటన్!
దొరకొను సామ్యత నొప్పు!స్తుతింప వలె!మోక్షంబందన్!తునుమం రాదిల సత్యమ్!
పరముడు భక్తిని మెచ్చ!ప్రతాపమున శ్రీమంతానన్!వనథీవై జను ధీరా!!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.