గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, నవంబర్ 2016, ఆదివారం

ధాతా పురస్తాద్యముదాజహార. మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
మంత్రం.17. ధాతా పురస్తాద్యముదాజహార. శక్రః ప్రవిద్వా న్ప్రదిశస్చతస్రః.
తమేవం విద్వానమృత ఇహ భవతి. నాన్యః పంధా అయనాయ విద్యతే.
వ్యాఖ్యానము:-
సృష్టి ప్రారంభమును కల్పాది (కల్పముయొక్క మొదలు) నుండి, పరమాత్ముని
వలన సృష్టి కొరకు, పరమాత్ముడు ప్రారంభించిన ఈ మహాయజ్ఞమునందు
ప్రభవించిన బ్రహ్మేందాది దేవతలు సమస్తము అవలోకించినారు.
'' బ్రహ్మవిద్ బ్రహ్మ భవతి''
ఆ బ్రహ్మ, ఇంద్రాదులు, పరబ్రహ్మను తెలుసుకొన్నవారైనారు.
సమస్తమునకు, ఆధార భూతుడైన పరమేశ్వరుని, తెలుసుకొనుటకువేరొకమార్గ
ములేదు.
పరమేశ్వరుని త్యాగమువలన, ఫ్రభవించిన ఈ ప్రపంచ నిర్మాణ మహాయజ్ఞమును
తెలుసుకొను విద్వాంసుడు, ఇక్కడే ఈ జన్మలోనే ముక్తుడవుతాడు.
మోక్షమునకు వేరే మార్గమేదియు లేదు.
మంత్రం 18. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః. తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ .
తే హ నాకం మహిమానః సచంతే . యత్ర పూర్వే సాధ్యాః సంతి తేవాః .
బ్రహ్మాది దేవతలు ఈ యజ్ఞమును తెలుసుకున్నవారై , ఆదే యజ్ఞము ద్వారా
భగవంతుని ఆరాధించారు.
ఆ యజ్ఞమునుండి,సమస్త ధర్మములు ఉత్పన్నమైనవి. అనగా ఆచరించ తగినవి
ఏర్పడినవి. కర్తవ్యములు అవగతమైనవి.
ఈ విధముగా ఏర్పడిన ధర్మములనాచరించి, మొదట ఋషుల, దేవతలు,
సాధ్యులు ( సాధనచేత పొందబడినవారు)వీరందరూ మహిమాన్వితమైన
ఉన్నత లోకాలను ( దివ్యజ్ఞానమును) పొందినారు.
దేవతలు ఈ ప్రపంచ నిర్మాణ మహాయజ్ఞాన్ని నెరవేర్చినందున,మహోన్నతమైన
దివ్యలోకాన్ని చేరుకొన్నరు.
ఈ మహా యజ్ఞమను తెలుసుకొని, తత్ ప్రతీకగా , ప్రకృతి నుండి స్వీకరిచుచున్న
ఉన్నతమై, పవిత్రమైన పదార్ధములతో యజ్ఞముముచేయమని,ఋషులు ప్రబోధించినారు. ( యజ్ఞమే విష్షు స్వరూపము)
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
విష్ణు స్వరూపమైన యజ్ఞమును అందలి ఫలితమును చక్కగా వివరించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.