గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, నవంబర్ 2016, శనివారం

అతో విచారః కర్తవ్యో . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో.  అతో విచారః కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తునః
సమసాద్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమమ్.
గీ. ఆత్మనెఱుఁగఁగ జిజ్ఞాసనలరు సుమతి
బ్రహ్మ విద్యలో నిపుణుని, భక్త సులభు
ననుపమాన దయాపరు నరసి వానిఁ
శిష్యుఁడై తాను గురువును చేర వలయు.
భావము. ఆత్మ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు ఆలోచించాలి. అటువంటివాడు మొదట బ్రహ్మవిద్యలో నిపుణుడై, దయ కలిగిన ఒక ఉత్తముఁడైన గురువును సమీపించాలి..
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఆత్మ జ్ఞానం పొదాలంటె అంత తేలికైన విషయం కాదు. ముందు తెలుసు కోవాలనుకునే వ్యక్తి కొంత దైవచింతన సహృదయత నిగ్రహ శక్తి లాంటివి కలిగి ఉండాలి .పిమ్మట అందుకు తగిన ఉత్తముడైన గురువును ఆశ్రయించాలి .బాగుంది. అందుకే మేలిమి బంగారం మన సంస్కృతి .చక్కని విషయాన్ని అందించారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.