జైశ్రీరామ్.
శ్లో. ఉత్తమం స్వార్జితం విత్తమ్, మధ్యమం పిత్రార్జితమ్.అధమం భ్రాతరం విత్తం స్త్రీవిత్తమధమాధమమ్.
గీ. తనదు సంపాదనము మేలు. తండ్రి ధనము
మధ్యమంబన్నదమ్ముల మాన్య ధన మ
ధమము స్త్రీధనంబులధ మాధమము తలుప,
కష్ట జీవికి సంతోష పుష్టి కలుగు.
భావము. కష్టపడి స్వయముగా సంపాదించిన ధనమే ఉత్తమమైనది. తండ్రి సంపాదించిన ధనముతో జీవించుట అన్నది మధ్యమము.సహోదరుని ధనముతో జీవించుట అధాము. స్త్రీ ధనముతో జీవించుట యన్నది
అధమాధమము.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.