జైశ్రీరామ్.
అంకెలతో తెలుగుకవిత్వపు చమత్కారం చూడండి.
అనువై నెన్నుదురొంటుగాఁ బదునొకండై కన్బొమల్ జంటగాఘనతం బోల్పఁగ రెండు తొమ్మిదులునై కర్ణద్వయం బొప్పగా
గన పూర్ణస్థితి బర్వ లీల నెసగంగా నింతయుం గూడదా
దినసంఖ్యం దిలకింప నిండునెలగా దీపించు మోమింతికిన్.
( ముకుందవిలాసం 2.98)
అమ్మాయి నుదురు "౧" - ఇలా ఉంది. కనుబొమలు "౧౧" - ఇలా ఉన్నాయి. కర్ణద్వయము "౯౯" - ఇలా ఉన్నాయి. అన్నీ కూడితే - అంటే ౧ + ౧౧ + ౯ + ౯ = ౩౦. ౩౦ రోజుల నిండునెలగా భద్రాదేవి ముఖం చంద్రునివలే భాసిస్తోంది.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అంకెలతో గారడీ తమాషాగా బాగుంది . చిరంజీవి రవిగారికి అభినందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.