జై శ్రీరామ్.
శ్లో. యేన కేన ప్రకారేణ, యస్య కస్యాపి దేహినఃసంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవేశ్వర పూజనమ్.
ఆ. ఎట్టి ప్రాణికైన, నే విధంబుగనైన
నెట్టి పని నయినను నెట్టులైన
సంతసంబుకొలుప సర్వేశ్వరుఁడు మెచ్చు
నదియె దైవ పూజ మదిని గనుఁడు.
భావము. ఏ ప్రాణికైనను, ఏ పని చేసియైనను, ఎట్లైనను ఆనందమును కలిగించుటయే మానవులకు ఈశ్వర పూజ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.