గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఆగస్టు 2016, ఆదివారం

శ్రీకృష్ణ దేవరాయలవారి 507 వ పట్టాభిషేక దినోత్సవము . . ఆహ్వానమ్

జై శ్రీరామ్.

ఆహ్వానమ్
ప్రియ సాహితీ బంధువులారా! శుభమస్తు.
తేదీ 07 - 08 - 2016  ఆదివారం సాయంత్రం 4 గంటలకు
సాహితీ సమరాంగణా సార్వభౌముఁడు శ్రీకృష్ణ దేవరాయలవారి 
507 పట్టాభిషేక దినోత్సవమును
 శ్రీ  జె.పి.ఎన్. నగరు కమ్మూనిటీ హాలులో
 జరిపించ తలపెట్టినారు.
కార్యక్రమమున తెలుగు, సంస్కృత, కన్నడ, తమిళ సాహితీవేత్తలుపాల్గొనుచున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు సాహితీ సౌరభాన్ని వ్యాపింప చేసిన “8” మందికి అష్ట దిగ్గజ ప్రశస్తి పురస్కార ప్రదానం.
ఈసందర్భంగా
కోమల సాహితీ వల్లభ డా. కోడూరు ప్రభాకర రెడ్డి, సాహితీ పీఠం, ప్రొద్దుటూరు తరుపున వార్షిక పురస్కార ప్రదానం
తెలుగు కోసం జీవితం ముడుపు గట్టిన  శ్రీ సా.వెం . రమేష్, గారికి.,
కార్యక్రమము జరుగు చిఱునామా:-
జయప్రకాశ నారాయణ్ నగర్ సముదాయ భవనం
వయా మియాపూర్,
హైదరాబాదు - 500 049.
దూర వాణి. 9177945559.
సందర్భముగా
సాహితీ ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం.
ముఖ్య ప్రసంగం - కృష్ణ రాయ రచితమైన ఆముక్త మాల్యద కావ్యము గురించి శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు
ముఖ్య అతిథులు
1.      ఆచార్య శ్రీ ఎల్లూరి శివారెడ్డి
2.     శ్రీ చెన్నూరి ఆంజనేయ రెడ్డి  
3.     శ్రీ ఎ.బి.కె. ప్రసాదు
4.     శ్రీ పి. సత్యనారాయణ.
అష్టదిగ్గజ ప్రశస్తి స్వీకర్తలు.
1.     శ్రీ పెండకూరు గురుమూర్తి, బెంగుళూరు.
2.    శ్రీమతి మంగిపూడి సుబ్బ లక్ష్మి, అధ్యక్షులు, శ్రీ అన్నమాచార్య సంగీత సాహిత్య కళాపీఠం, చోడవరం,          విశాఖపట్టణం.
3.    శ్రీ కంది శంకరయ్య, విశ్రాంత తెలుగు పండితుడు, శంకరాభరణం బ్లాగు నిర్వాహకులు, వరంగల్లు.
4.    శ్రీ కె.సురేంద్ర బాబు, బళ్ళారి.
5.     శ్రీ బాలమురుగన్, దేవకీపురం, తమిళనాడు.
6.    శ్రీ నిష్టి రుద్రప్ప, బళ్ళారి.
7.    శ్రీ వడ్డిపల్లి శ్రీనివాస రావు, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా.
8.    శ్రీ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా.
గుత్తి (జోలదరాశి)చంద్రశేఖర రెడ్డి
డా. కోడూరు ప్రభాకర రెడ్డి
జై హింద్
Print this post

4 comments:

కంది శంకరయ్య చెప్పారు...

ధన్యవాదాలు!

A.Satyanarayana Reddy చెప్పారు...

గురువర్యులకు ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఇందలి సాహితీ స్రష్ట లందరికీ ప్రణామములు

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

కార్యక్రమ నిర్వాహకులకు....
సన్మాన గ్రహీతలకు...
శుభాభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.