జైశ్రీరామ్.
శ్లో. వృద్ధత్వానలదగ్ధస్య సారయౌవనవస్తునః
దృశ్యతే దేహగేహేషు భస్మైవ పలితచ్ఛలాత్.
దృశ్యతే దేహగేహేషు భస్మైవ పలితచ్ఛలాత్.
క. వృద్ధాగ్ని దగ్ధ యౌవన
సిద్ధ మహావస్తు చయము చెడి బూడిదయై
యుద్ధతి నెరసిన జుత్తుగ
నిద్దేహ గృహంబునమరె నిది కన వలదా!
భావము. ముసలితనము అనే అగ్నితో దహింపబడిన సారవంతమైన యౌవన సామగ్రి అంతా - దేహమనే లోగిళ్ళలో నెరసిన వెంట్రుకలనే నెపంతో బూడిదలా రాలుతోంది.
జైహింద్.
1 comments:
నమస్కారములు
నెరసిన వెంట్రుకలలో దాగిన జ్ఞాపకాలు చేదు నిజాలను బేరీజు వేస్తూ దేహంతో పాటు అగ్నిలో దహించుకు పోతాయ్ .బాగుంది హృదయాన్ని కదిలించే సూక్తి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.