గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2014, గురువారం

యది నాత్మని పుత్రేషు ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. యది నాత్మని పుత్రేషు నచేత్పౌత్రేషు,నప్తృషు
నత్వేవ తు కృతోధర్మః కర్తుర్భవతి నిష్ఫలః. 

గీ. కర్తయె యధర్మఫలభోక్త. కాని నాడు,  
కొడుకులో, కాక మనుమలో కుడువ కుండ 
సమసి పోవదధర్మము. సరళిఁ గనుఁడు. 
ధర్మవైరుధ్య  పాపిష్టి కర్మవిడుడు.
భావము. ఒకడు తాను చేసిన అధర్మఫలం తాను అనుభవించకపోతే, దానిని అతని కుమారుడో, అతని మనుమడో, మునిమనుమడో అనుభవించక తప్పదు. అధర్మఫలకర్తృత్వం ఎప్పటికీ సమసిపోయేదికాదు. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఇదిమాత్రం ఖచ్చిత మైన నిజం .ఎవరు చేసిన పాపపుణ్యముల ఫలితాలు వారే అనుభవించక తప్పదు కాకపోతె అవి వారసత్వంగా వస్తూనే ఉంటాయి.ఇది చాలా మందికి అనుభ వేద్యమే మరి బాగుంది చక్కని ఆణిముత్యాలను అందిస్తున్నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.