జైశ్రీరామ్.
శ్లో. బలవాన ప్యశక్తో உసౌ, ధనవానపి నిర్ధనఃశ్రుతవానపి మూర్ఖశ్చ యో ధర్మ విముఖో జనః.
గీ. ఎవఁ డధర్మాతిరిక్తుఁడో యిలనతండు
బలసుసంపన్నుఁడయ్యు నబలుఁడె కనఁగ,
ధనికుఁడయ్యును చూడ నిర్ధనుఁడతండు.
విద్య కల్గుయుహీనుఁడే విద్య చేత.
భావము. ఎవడు ధర్మానికి ప్రతికూలుడో , వాడు బలవంతుడైనా శక్తిహీనుడే. ధనవంతుడైనా దరిద్రుడే, చదువుకొన్న వాడైనా మూర్ఖుడే.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును ఇది నగ్నసత్యం ఎప్పడికైనా ధర్మమె గెలుస్తుంది ధర్మానుష్టానులే కీర్తి శేషులౌతారు .మంచివిషయం తెలిపారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.