జైశ్రీరామ్.
శ్లో. అపరాధం సహేతాల్పం తుష్యేదల్పేஉపి చోదయే
మహోపకారాంశ్చాధ్యక్షాన్ ప్రగ్రహేణాభిపూజయేత్.
మహోపకారాంశ్చాధ్యక్షాన్ ప్రగ్రహేణాభిపూజయేత్.
గీ. అల్ప దోషంబు మన్నింపనగును కనుమ,
అభ్యుదయమల్పమున్నచో నరసి పొగడు,
మేలు చేసిన వారిని మెచ్చుకొనుచు
గౌరవించుము. పొందుము గౌరవంబు.
భావము. చిన్న పొరపాటును క్షమించాలి. అల్పమైన అభ్యుదయానికైనా సంతోషించాలి. మహోపకారం చేసిన వారిని గౌరవించాలి.
జైహింద్.
1 comments:
నమస్కారములు
ఇటువంటి ఉత్తమగుణాలు సజ్జనుల లక్షణాలు అందరు అలవరచు కోగలిగితే ముదావహం .బాగుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.