జైశ్రీరామ్.
శ్లో. సాధురేవార్థిభిర్యాచ్యః క్షీణవిత్తోஉపి సర్వదా శుష్కోஉపి హి నదీమార్గః ఖన్యతే సలిలార్థిభిః.
గీ. సంపదంతయు వ్యయమయ్యు సజ్జనుండు
కోరఁ బడుచునుండర్థిచే. నీర మిచ్చు
నదులు భువి నెండిపోయినన్ వదలరు కద
చెలమలను త్రవ్వుచుందురు సలిలములకు.
భావము. తమ సంపదలను తాము కోల్పోయినా, సజ్జనులు అర్థులచే ఎల్లప్పుడూ యాచింపబడుతూనే ఉంటారు. నది ఎండిపోయినా, జలార్థులు ఆ నదీ మార్గాన్నే నీటికోసం త్రవ్వుతూ ఉంటారుకదా.
జైహింద్.
1 comments:
నమస్కారములు
బాగుంది మంచి సూక్తి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.