జైశ్రీరామ్.
శ్లో లోభాత్క్రోధః ప్రభవతి క్రోధాద్ద్రోహః ప్రవర్తతేద్రోహేణ నరకం యాతి శాస్త్రజ్ఞోஉపి విచక్షణః.
క. కోపముఁ గొలుపును లోభము.
కోపంబది ద్రోహ చింతఁ గొలుపును తలపన్.
ప్రాపించునరక యాతన
దీపించెడి ద్రోహమునను తెలియగ మనకున్.
భావము. ఎంతటి శాస్త్రజ్ఞునకైనా, నేర్పరికైనా లోభం వలన కోపం పుడుతుంది. కోపం వలన ద్రోహచింతన కలుగుతుంది. ద్రోహం చేస్తే నరకలోకం ప్రాప్తిస్తుంది.
జైహింద్.
1 comments:
నమస్కారములు
ముఖ్యంగా ఈ అరిషడ్ వర్గాలకు దూరంగా ఉండటం అలవరచు కుంటే అన్నీ చక్కబడతాయి కానీ అదంత తేలిక కాదుకదా సాధన వలన కొంతైనా సాధించ గలిగితే ధన్యులము కాగలము .అందరు తెలుసుకోవలసిన సూక్తి బాగుంది ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.