గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జులై 2014, సోమవారం

న వినా పరవాదేన ...మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. న వినా పరవాదేన రమతే దుర్జనో జనః
కాకః సర్వరసాన్భుక్త్వా వినామేధ్యం న తృప్యతి. 
ఆ. వ్యర్థ వాదనలననర్థంబు కలిగించు 
దురితుడితరులకు వదరుచు సతము.
మంచి తిండి తినియు మలినము తినునట్టి 
కాకి వోలె బుద్ధి లేక మెలగు.
భావము. దుర్జనుడు ప్రతిరోజూ ఇతరులతో వాదన పెట్టుకుంటేనేగానీ సంతృప్తి చెందడు. కాకి ఎంతో రుచికరమైన పదార్థాలను ఎన్ని తిన్నా, అపవిత్ర పదార్థం తింటేనేగానీ తృప్తి చెందదుకదా! 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అసలు కాకి లక్షణమే అంత "కుక్కతోక వంకర అన్నట్టు పుట్టుకతో ఉన్న బుద్ధిమరి
దుష్ట బుద్ధికి అల వాటు పడిన దుర్జనుడు కుడా అంతే కదా చక్కని విషయాన్ని చెప్పారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.