జైశ్రీరామ్.
శ్లో. అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా అనుగ్రహశ్చ దానంచ శీలమేతద్ విదుర్బుధాః
గీ. జీవ కోటిపై విద్రోహ చింత లేక,
దయకు రూపముగా నిల్చి, దాన విరతి
కలిగియుండుట శీలంబుగా గణింత్రు
బుధులు. కనుడయ్య విజ్ఞాన పూర్ణులార!
భావము. మనోవాక్కాయ కర్మల ద్వారా అన్ని జీవులయందు ద్రోహచింతన లేకుండుట, దయాస్వభావము, దాన గుణము కలిగి యుండుట అనే లక్షణాలను ఉత్తమశీలంగా జ్ఞానులు పేర్కొంటారు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
త్రికరణ శుద్ధిగా అన్నిప్రాణుల యందును ఆదరణ కలిగియుండిన వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులే అవుతారు అంతకంటె అదృష్ట వంతులు ఇంకెవరుంటారు ? బాగుంది ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.