గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జులై 2014, ఆదివారం

ధర్మం, ధనం చ , ధాన్యం చ , ...మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. ధర్మం, ధనం చ , ధాన్యం చ , గురోర్వచన , మౌషధం
సుగృహీతం చ కర్తవ్య మన్యథా తు న జీవతి. 
గీ. ధర్మ, ధన, ధాన్య, గురు వాక్య తత్వ, మౌష 
ధములమరినప్పుడే యిల తడయకుండ 
ననుసరించిన జీవింపనగును మనకు
నమృత పంచకమీయైదునరయుఁడయ్య.
భావము. ధర్మం, ధనం , ధాన్యం , గురువాక్యం , ఔషధం చక్కగా గ్రహించి వెంటనే సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే జీవించలేం. 
జైహింద్.


Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
జీవితాన్ని సద్విని యోగం చేసుకోవడానికి ముందు ఇవన్నీ గ్రహించి ఆచరించ గలిగితే అంతకంటే అదృష్టం ఏముంది ? బాగుంది మంచి సూక్తి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.