జైశ్రీరామ్.
శ్లో. జనితా చోపనేతా చ యస్తు విద్యాం ప్రయచ్ఛతిఅన్నదాతా భయత్రాతా పంచైతే పితరః స్మృతాః.
గీ. కన్నతండ్ర్యుపనేతయు, జ్ఞాన విద్య
కరపునాతడు నన్నంబు కడుపునిండ
బెట్టునాతఁడు,భయము పోగొట్టునతడు
తండ్రులౌదురీయేవురు తలచి చూడ.
భావము. కన్నవాడు , ఉపనయనం చేసినవాడు , విద్య నేర్పినవాడు ,అన్నం పెట్టినవాడు , భయం పోగొట్టినవాడు ఐదుగురూతండ్రులే.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును వీరంతా మనకు ఏడుగడఏ అది గ్రహించని వారు వీరిపట్ల అపచారములు చేస్తూ ఉంటారు అదే మనదురదృష్టం ప్చ్! ఏంచేస్తాం .ఎప్పడికైనా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదా ! వేచి చూడటమే
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.