జైశ్రీరామ్.
శ్లో. పాత్రాపాత్ర వివేకోస్తి ధేను పన్నగయోరివతృణాత్సంజాయతే క్షీరం క్షీరాత్సంజాయతే విషమ్.
గీ. గడ్డిని తిని పాలిచ్చును గంగి గోవు.
పాలు త్రావి విషము చిందు పన్నగమ్ము.
పాత్రతాపాత్రములఁబట్టి వర్థిలునిల
మంచి చెడ్డలు మనలోన మహితులార!
భావము. వివేకం పాత్రాపాత్రతలను బట్టి ఉత్పన్నమౌతుంది. గడ్డి వల్ల గోవులో పాలు ఏర్పడితే, పాలవల్ల పాములో విషం ఉద్భవిస్తుంది.
జైహింద్.
1 comments:
నమస్కారములు
మనం పెట్టిన పిడికెడు గడ్డితిని మనమీద క్రోధం లేకుండా కడివెడు పాలిస్తాయి కానీ ఆ పాలను త్రాగిన పాము కంటే మనుష్యులే ఎక్కువ విషం కక్కు తారు baagumdi
చిరంజీవి శ్రీ పండితుల వారికి గురుపూర్ణిమ శుభా కాంక్షలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.