జైశ్రీరామ్.
శ్లో. క్షుధ్, తృట్, ఆశా: కుటుంబిన్యో మయి జీవతి నాஉన్యగా: తాసాం ఆశా మహాసాధ్వీ కదాచిత్ మాం న ముంచతి .
క. ఆకలి దాహము నాశయు
నాకగుయిల్లాండ్రు సతులునను విడువరిలన్
ఆకలి, దాహము విడనగు,
నాకున్నదురాశభార్య ననువిడి పోదే!
భావము. నాకు(సంసారికి) – ఆకలి, దాహము, ఆశ అనే ముగ్గురు - ఎన్నడూ వదలని ఇల్లాండ్రు. వారిలో అప్పుడప్పుడు మొదటి ఇద్దరూ (ఆకలి,దాహము) కొంతసేపు దూరమైనా, మూడవదైన ఆశ మాత్రం మహాసాధ్వి. నన్ను(సంసారిని) ఎప్పుడూ వదిలిపెట్టదు!
జైహింద్.
1 comments:
నమస్కారములు
అసలు ప్రతి జీవికీ ఉండేవే ఆమూదు లక్షణాలు . వీటిలో ఏఒక్కటి తప్పుకున్నా యతులు కాగలరు మంచి సూక్తి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.