జైశ్రీరామ్.
శ్లో. అయమేవ పరోధర్మః, ఇయమేవ విదగ్ధతా
ఇదమేవ హి పాండిత్యం, యదాయాన్నాధికో వ్యయః.
క. మితముగ వ్యయమును చేయుటె
యతులిత సద్ధర్మమును, మహన్నిపుణతయున్.
క్షితి పాండిత్యమునదియే
సతత మితవ్యయపరులకు సౌఖ్యంబబ్బున్.
భావము. ఆదాయాన్ని మించి వ్యయం చేయకూడదు అనేదే శ్రేష్ఠధర్మం. అదే నైపుణ్యం.అదే పాండిత్యం.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అదేగా ఆంగ్లంలో " కోటుచూసి బట్ట కత్తిరించ మన్నారు " శక్తికి మించిన దేదీ శ్రేయస్కరం కాదు .మంచి విసయం చెప్పారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.