జైశ్రీరామ్.
శ్లో. ఆమరణాంతాః ప్రణయాః, కోపాః తక్షణ భంగురాఃపరిత్యాగాశ్చ నిశ్శంకాః భవంతి హి మహాత్మనామ్.
క. మహితుల ప్రణయమనంతము.
మహితుల కుపితము క్షణంబె మాయును పిదపన్.
మహితుల త్యాగమశంకిత
మహితులకును హితులు వారలమరులు తెలియన్.
భావము. మహాత్ముల స్నేహాలు మరణపర్యంతాలు. కోపాలు తక్షణమే నశించి పోతాయి. వారి త్యాగాలు ఏమాత్రమూ శంకలేనివిగా ఉంటాయి.
జైహింద్.
1 comments:
నమస్కారములు
మహాత్ములతో స్నేహం అద్భుత మైన అనుభూతి .అసలు లభిచడమే గొప్ప అదృష్టం నేర్చు కోవలసినవి కోకొల్లలు .వాటి ముందు ఏవైనా తక్కువే చాలా బాగుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.