జైశ్రీరామ్.
శ్లో. సా శ్రీర్యా న మదం కుర్యాత్స సుఖీ తృష్ణయోజ్ఝితః తన్మిత్రం యత్ర విశ్వాసః పురుషః స జితేంద్రియః. గీ. గర్వమును చేర నీయని కలిమి కలిమి.
ఆశనెడఁ బాసి పొందెడి హాయి హాయి, ఇలను విశ్వాసపాతృఁడౌ హితుఁడు హితుఁడు. మహిజితేంద్రియుఁడైనట్టి మనిషి మనిషి.
భావము. గర్వాన్ని కలుగజేయనిదే అసలైన సంపద.ఆశను జయించినవాడే సుఖవంతుడు. విశ్వాసపాత్రుడే నిజమైన మిత్రుడు.ఇంద్రియాలను జయించినవాడే ఉత్తమపురుషుడు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
ఇవన్నీ నిజమే కానీ ఎంతమంది జయించ గలరు ? అన్నదే ప్రస్న .కాకపోతే " సాధనమున పనులు సంకూరు ధరలోన అన్నట్టు కొన్నిపనులు దీక్షతో సాధించ వచ్చునేమొ .ఈ ఆణి ముత్యాలను దృష్టిలో ఉంచు కుంటే కొంతసాధించ వచ్చును ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.