గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జులై 2014, బుధవారం

యథా పరోపకారేషు....మేలిమి బంగారం మన సంస్కృతి, 217.

జైశ్రీరామ్.
శ్లో. యథా పరోపకారేషు నిత్యం జాగర్తి సజ్జనః
తథా పరాపకారేషు జాగర్తి సతతం ఖలః.

గీ. నిత్యముపకారమును చేయు నియతి తోడ 
మెలగు సజ్జనుండెపుడును వెలుగు జగతి. 
నిత్యమపకారమును చేయు నియతితోడ 
మెలగు దుర్జనుండెపుడును మిడిసి పడుచు.
భావము. ఏ విధంగా సజ్జనుడు పరోపకారం చేయటానికి ఎల్లప్పుడూ జాగరూకుడై ఉంటాడో, అలాగే దుష్టుడు ఇతరులకు అపకారం చేయటానికి నిత్యం మేల్కొని ఉంటాడు!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఒకరిది మంచి బుద్ధి , మరొకరు చెడ్డ బుద్ధి అదే తేడా ఎంత చిత్రం ? ఇద్దరు నింగీ నేలా బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.