గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జులై 2014, సోమవారం

అపరాధో న మే உస్తీతి...మేలిమి బంగారం మన సంస్కృతి, 121.

జైశ్రీరామ్.
శ్లో. అపరాధో న మే స్తీతి నైతద్విశ్వాస కారణం 
విద్యతే హి నృశంసేభ్యో భయం గుణవతామపి. 

క. అపరాధము చేయని నా 
కపరాధము చేయరితరులనుకొనఁ దగదోయ్. 
నెపమెన్నక చేతురు మీ 
కపరాధముదుశ్చరితులహర్నిశలు కనన్.
భావము. నాయందు అపరాధమేమియు లేదు, నాకేమి భయమని సజ్జనుడు ఏమరుపాటుగా ఉండుట తగదు. గుణవంతులకైనా క్రూరులవల్ల భయం కలుగుతుంది.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఎంతటి మంచి వారికైనా కలి ప్రభావం సోకితే భయపడక తప్పదు .కలి ఎంతపనైనా చేయగలదు చేయించ గలదు .అందుకని మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది నిజంగా అమృతగుళికలు మన ఆంధ్రామృతం /జోహార్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.