గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జులై 2012, ఆదివారం

స్వాతంత్ర్య భారతావనికి 13 వ రాష్ట్ర పతిగా ఎన్నికైన శ్రీ ప్రణబ్ ముఖర్జీ కి అభినందనలు.

శ్రీ ప్రణబ్ ముఖర్జీ.
భావి భారత ఆశా కిరణంగా భారత దేశ 13వ ప్రథమ పౌరునిగాఎన్నికయి,  అఖండవిజయం సాధించిన మాన్యశ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి ఆంధ్రామృతం అభినందనలు తెలియఁ జేస్తోంది.
మన కన్న తల్లి భారతాంబ తన ముద్దు బిడ్డలను చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. 
అదే సమయంలో తాను తన ముద్దు బిడ్డలు యావద్భారతావనినీ ఆశ్రయించి జీవిస్తున్న తోటి బిడ్డలను దృష్టియందుంచుకొని అందరికీ ఆనందం కలిగించే విధంగా ధర్మ యుతంగా మెలగాలని ఆకాంక్షిస్తోంది.
ఐతే నేడు అనంత దురంతాలతో ఒకరినొకరు మోసం చేసుకోవటమే కాక సహృదయులైనవారి కెందరికో బాధాకరంగా ప్రవర్తిస్తూ శిక్షలనుండి తప్పించుకొంటూ, ఒక వేళ శిక్షలు పడినా రాష్ట్రపతి నుండి క్షమాభిక్ష పొందుతూ నిర్లజ్జగా యధాపూర్వకంగా ప్రవర్తిస్తున్న దుష్ట సంతతిపట్ల కఠినాతికఠినంగా ప్రవర్తించే, న్యాయాన్ని నాలుగు పాదాలా నడప గలిగే బిడ్డలు తనకు ఉండాలని కోఱుకుంటోంది.
అన్ని విధాలా ఆదర్శవంతమైన సరళిని అనుసరిస్తూ, సామాజిక ఆర్థిక, వైయక్తిక  జీవన విధానంలో ఆదర్శవంతమైన ప్రథమ పౌరుఁడుగా మన ప్రణబ్ ముఖర్జీ యావద్భారతీయులకూ ఆదర్శమూర్తి కావాలనీ, యావద్భారతీయులూ, ఆదర్శ వంతులైనవారి ఆదర్శ జీవన మార్గాన్ని అనుసరించడం ద్వారా ఆదర్శవంతమైన జీవితం గడుపుట ద్వారా మన భారతాంబ కలలు పండించాలని మనసారా కోరుకొంటూ 
మరొక్క పర్యాయం 
13వ భారత రాష్ట్రపతిగా ఎన్నికైన మాన్యశ్రీ ప్రణబ్ ముఖర్జీని మనసారా అభినందిస్తున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మంచి శుభ వార్త చెప్పారు . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.