గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జులై 2012, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 122. విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

జైశ్రీరామ్.
శ్లో:-
విద్వత్వంచ నృపత్వంచ నైవ తుల్యం కదాచన.
స్వదేశే పూజ్యతే రాజా. విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

తే.గీపాండితికి సరికాదిల ప్రభుత చూడ

రాజు పూజింపఁబడు తన రాజ్యముననె,

పండితీయుతులెటనైన ప్రతిభ చేత

పూజలందుట నిక్కము భూమిపైన.

భావము:-
పాండిత్యము, రాజరికము  ఎప్పుడూ ఒకదానితో ఒకటి సమానము 
కానేరవు. రాజు స్వదేశములో మాత్రమే పూజింపఁబడు చుండగా 
విద్వాంసుఁడు ఎక్కడైననూ పూజింపఁ బడును.
జైహింద్.
Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నిజమే , రాజులు , రాజ్యాలు , ఆయా దేశము లందు మాత్రమె ,కీర్తిని పొందుతారు. చరిత్ర పరంగా చదివితే తప్ప గుర్తు ఉండవు .కానీ కవులు , పండితులూ , వీరి రచనలు , ప్రబంధ కావ్యాలు , యుగ యుగాలుగా గుర్తు చేస్తూనే ఉంటాయి . ఇది మేలిమి బంగారమే మరి . ధన్య వాదములు .

గిరిజా ప్రసాద్ చెప్పారు...

పాండిత్యము, రాచరికము సాటి లేనివి అని అన్వయించడం సబబు కాదు.రెండు సమానము కానేరవు.శ్లోకం పాండిత్యానికి పెద్ద పీట వేసింది. రెంటికీ సామ్యం లేదని మొదటి పంక్తి చెబుతుంది.అనువాదము లోపభూయిష్టమేమో.. విఙ్ఞులు చెప్పాలి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యవాదాలు గిరి ప్రసాద్ గారూ! నేను మీసూచన గ్రహించి సరి చేసుకున్నానండి. నమస్రే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.