జైశ్రీరామ్.
శ్లో:-
యద్యదిష్టతమంలోకే యచ్చాస్యదయితం గృహే.
తత్తద్గుణవతే దేయం తదేవాzక్షయమిచ్ఛతా.
గీ:-
తనకు నెయ్యది యిష్టమో తలచి చూచి,
తన గృహంబున నెయ్యవి తనుపు తనను,
తనకు నక్షయంబుగ కోరు దాని నెంచి
యోగ్యులకునీయ పాడియౌ. భాగ్య మదియె.
భావము:-
లోకమున తనకేది మిక్కిలి యిష్టమో, వేటిని తన యింట ప్రియతమముగా చూసుకుంటారో, ఏయే ప్రియమైన వస్తువులు తనకు అక్షయంగా ఉండాలని కోరుకొంటారో, ఆయా వస్తువులను యోగ్యులకు ఇచ్చుచుండ వలెను.
మనకు నచ్చిన, ఇష్టమైన విగా ఏ వస్తువులుండునో అట్టి విశిష్టమైన వస్తువులనే యితరులకు ఈయ వలెను కాని, తనకక్కరలేని, ఇష్టము లేని, పనికిరాని వస్తువులను ఈయరాదు అని తాత్పర్యము.
జైహింద్.
Print this post

2 comments:
చాలా బాగుందండి.
నిజమే , ఛాలా మంది అల్లాగే చేస్తూ ఉంటారు . తమకి పనికి రానివి బాగా లేవను కున్నవీ పంచి పెట్టి పొదుపు చేశా మనుకుంటారు .
మేము ఒకసారి గుడికి వెళ్ళాము . అ పూజారి భార్య ప్రసాదం అని చెప్పి బోలెడు బోలెడు , దద్దోజనం దోసిలి నిండా పెట్టింది .అది నిన్నటిది .పాడై పోయింది. అనవసరంగా వెళ్ళి తెచ్చి పడేసామని బాధ పడ్డాము. ఇలా ఎందరో తెలుసుకో వలసినమంచి శ్లోకం . చక్కగా వివరించారు. ధన్య వాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.