గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, మార్చి 2012, బుధవారం

(మియాపూర్)H.M.T.స్వర్ణపురిలో శ్రీదేవీ,భూదేవీ సమేతశ్రీ వేంకటేశ్వర స్వామివారి మూర్తి ప్రతిష్ట.

జైశ్రీమన్నారాయణ.
భగవద్భక్తులారా! హైదరాబాదు, (మియాపూర్) H.M.T.స్వర్ణపురిలో ప్రతిష్టితమౌతున్న శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారిని కనులారా కనుగొనే మహదవకాశం మన పురాకృత పుణ్య ఫలంగా లభింపనుంది. అవకాశమున్నవారు తప్పక ఈ ఉత్సవమును కనులారా తిలకించి పులకిత గాత్రులై పునీత మనస్కులై పరవశిస్తారనే ఆశతో ఈ మహదవకాశాన్ని మీకు తెలియ జేస్తున్నాను.
తే.17 - 03 - 2012 న ప్రముఖ శతావధాని, డా. కట్తమూరి చంద్రశేఖరం & శ్రీమతి చంద్రశేఖరం గార్లచే, వారు స్వయముగా రచించి గానం చేయుచున్న సుందరాకాండ గానము సాయంత్రం 6 గంటలనుండి రాత్రి  9 గంటల వరకు నిర్వహించుటకు ఏర్పాటు చేయ బడిందని తెలియ జేయుటకు మిక్కిలి సంతసించు చున్నాను.
విశేష పుణ్య ఫలముగా లభించే ఇట్టి మహదవకాశాన్ని ఉపేక్ష చేయక తప్పక పాల్గొని, ఆ పరమాత్మ కృపకు పాత్రులమవచేయ వలసినదిగా ఆపరమాత్మను ప్రార్థిస్తున్నాను.
ROUT  MAP.
View Larger Map
శుభమస్తు.
జైహింద్.
Print this post

3 comments:

అజ్ఞాత చెప్పారు...

http://andhraamrutham.blogspot.com/2012/02/blog-post_8685.html

"విగ్రహ ప్రతిష్ట" కు బదులు ఈ పొష్ట్ లొ "మూర్తి ప్రతిష్ట" అని వ్రాసి మంచి పనిచెసారు.

ఇతరులను కూడా ఈ విషయము మీద ఎడ్యుకెట్ చెయండి.

ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

ఈ దేవాలయానికి చేరుకునే దారి చెప్పగలరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కూకట్ పల్లి మీదుగా లింగంపల్లి వెళ్ళే దారిలో మియాపూర్ X రోడ్ వస్తుంది. అక్కడ నుండి భొల్లారం రోడ్డుకు వెళ్ళే ఉత్తర ముఖ రహదారి ద్వారా పయనించి ఒక కిలోమీటరు లోపే వెళ్ళే సరికి కుడివైపు రోడ్డుకు అవతల హేచ్డీ యఫ్సీ బేంకు , దానికి వ్యతిరేక దిశలో రోడ్డుకు ఇవతల పశ్చిమ దిశగా వెళ్ళే జేపీ నగర్ రోడ్డు ఉంటాయి. ఆ సెంటర్ ను జేపీ నగర్ యక్స్ రోడ్డు అంటారు. ఆ రోడ్డ్ననుసరించి తిన్నగా ప్రయాణిస్తే హెచెమ్టీ స్వర్ణ పురి కోలనీ వస్తుంది. తప్పక వస్తారుకదూ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.