గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మార్చి 2012, గురువారం

గోవుమాలచ్మికీ కోటి దండాలు.


శ్లోll 
సర్వ వేదమయీం వందే సర్వ దేవ స్వరూపిణీం.
గాం సర్వ లోక జననీం సర్వ ధర్మ స్వరూపిణీం.
భావముః-
సర్వ వేదములతో కూడుకొన్నదియు, సమస్త దేవతా స్వరూపిణియు, సమస్త లోకములకు తల్లియు, సమస్త ధర్మ స్వరూపిణియు అగు గో మాతకు నమస్కారము.
శ్లోll
నమో గోభ్యః, శ్రీమతీభ్యః సౌరభేయీభ్య యేవచ.
నమో బ్రహ్మ సుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః.
శ్లోll
గవాం దృష్ట్వా నమస్కృత్య కుర్యాచ్చైవ ప్రదక్షిణం
ప్రదక్షిణీ కృతా తేన సప్త ద్వీపా వసుంధరా.
శ్లోll
సౌరభేయీ సర్వ హితే పవిత్రే పాప నాశిని,
సర్వ దేవమయే దేవీ సర్వ తీర్థమయే శుభే.
శ్లోll
యా లక్ష్మీ సర్వ లోకేషు యాచ దేవేష్వవస్థితా
ధేను రూపేణ, సా దేవీ మమ పాపం వ్యపోహతు.
శ్లోll
పితరో వృషభో జ్ఙేయా గావో లోకస్య మాతరః
తాసాం పూజయా రాజన్ పూజితా పిత్రు దేవతాః.
శ్లోll
గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ.
యస్మాత్తస్మాచ్ఛివం మేశ్యా దతశ్శాంతిం ప్రయచ్ఛమే.
సీః- ఆననంబునను జిహ్వనుశృంగముల బల
వైరి రంధ్రంబుల మారుతుండు.
కకుదంబునందు శ్రీ కంఠుఁడు పదముల
యందు మరుద్గణ మనఘ కుక్షి
వహ్ని, చన్నుల సరస్వతి, పెండ బంచిత
మున లక్ష్మియును, గీర్తియును గ్రమమున
రుధిరంబునందు చంద్రుఁడు, హృదయంబున
భగుఁడను దేవత, పాల వేధ.
వెండ్రుకలయందనుష్ఠాన వితతి, దోక
ధర్ముఁడక్షుల సూర్యుండు, చర్మమున ద
పంబు సిద్ధి తేజము, సంధి పట్ల సిద్ధు
లునికి గల్దటె గోవునేమనగ వచ్చు. (మహా భారతం)
శ్లోll 
వరుణశ్చైవ గోమూత్రే,
గోమయే హవ్య వాహన:,
దధే వాయు:సముద్దిష్ట:,
సోమ:క్షీరే,ఘృతే రవి:.
గీః-
గోవు మూత్రాన వరుణుఁడు, గోమయమున
నగ్ని దేవుఁడు,  గోధధి నలరుననిలుఁ
డావు పాలలోచందురుఁడావు నేతి
లోన సూర్యుఁడుండును గన లోకమందు. 
భావముః-
గోమూత్రంలో వరుణుఁడున్నాఁడు. గోమయంలో అగ్ని దేముఁడున్నాఁడు.ఆవు పెరుగులో వాయువుఁడు న్నాఁడు. ఆవు పాలలో చంద్రుఁడున్నాఁడు.ఆవు నేతిలో సూర్యుఁడున్నాఁడు.
శ్లోll
సభా, ప్రపా, గృహాశ్చాపి దేవతాయతనానిచ.
శుద్ధ్యంతి శకృతా యాసాం కిం భూత మధికం తతః.
శ్లోll
కీర్తనం శ్రవణం దానం, దర్శనంచాపి పార్థివ
గవాం ప్రశస్యతే  లోకే సర్వ పాప హరం శివం.
శ్లోll
గవాంహి తీర్థే వసతీహ గంగా పుష్టిస్తధా తద్రజసి ప్రవృద్ధా.
లక్ష్మిః కరీషే ప్రణతౌచ ధర్మః తాసాం ప్రణామం సతతంచ కుర్యాత్. 
జైశ్రీరామ్.
జైహింద్.                                   
Print this post

6 comments:

Pandita Nemani చెప్పారు...

మత్తకోకిల
ఏమి భాగ్యమొ ఏమి భాగ్యమొ ఈ దినమ్మొక పర్వమౌ
కామితమ్ములనిచ్చి సాధుల గాచు దైవము బ్లాగులో
కామధేనువు దర్శనంబిడె కన్నువిందగు రీతిలో
ప్రేమమూర్తికి వందనమ్ములు వేనవే లొనరించెదన్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

వందనంబులు పండితోత్తమ భాగ్యమీరె కనంగ నా
యందు చూపెడి ప్రేమ పెన్నిధి యౌనుగాదె సతంబు.మీ
సుందరాద్భుత మత్త కోకిల శోభ గాంచుచు పాఠకుల్
బంధురంబుగ వ్రాయ బూనరె? భాగ్యమింతకు నుండునే?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గోమాత యొక్క విశిష్టతను కన్నుల విందొనర్చిన పుణ్యా త్ములు శ్రీ చింతా వారికి ధన్య వాదములు .

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చక్కగ దీవించెడి మా
యక్కా! రాజేశ్వరక్క!యలరింతువుగా
చక్కగ ప్రోత్సాహించుచు,
నిక్కము మా వృద్ధి నీవు.నెనరులు నీకున్.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

దేవతలెల్లరు నొకచో
నావాసము జేయునట్టి యారూపంబే
గోవై నిలచెను భువిపై
ఆవులకున్ మ్రొక్కుచుంటి నానందముగా

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీపతి చేసిన యటులే
గోపాద అతుష్టయంబు కోరుచు కొలువన్
పాపంబులు నశియించును.
శ్రీపతి కరుణించి కాచు.శ్రేయము గొలుపున్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.