గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మార్చి 2012, శనివారం

అవధాని డా. చంద్రశేఖరం భాగ్యనగరంలో౧౯ వతేదీ సాయంత్రం వరకు ఉంటారు.అవధానం ఎక్కడైనాపెట్టిస్తే ప్రయోజనం చేకూరుతుంది.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
డా. కట్టమూరి చంద్రశేఖరావధాని ఈ రోజు హెచ్చెమ్టీ కాలనీలో సుందరాకాండ వారి సతీమణితో కలిసి గానం చేయనున్నారు. వారు రేపంతా మన హైదరాబాదులోనే ఉంటారు. ఎల్లుండి సాయంత్రం వరకూ కూడా ఉంటారు.
ఈ సదవకాశాన్ని సాహితీ ప్రియులు వారి అవధానం ఏర్పాటు చేసుకోవడం ద్వారా సద్వినియోగపరచుకొనే మంచి అవకాశం. వారు మియాపూర్ లో ఉన్నారు. మీ స్పందనకై ఎదురు చూస్తున్నాను.
నమస్తే.
జైహింద్.
Print this post

4 comments:

Zilebi చెప్పారు...

ఏమండీ చింతావారు,

'బ్లాగ్'లోక అంతర్జాతీయ అవధాన ప్రక్రియ కి నాందీ పలికితే ?

ఆలోచించి చూడండి. ఈ ప్రక్రియ అంతర్జాతీయ మేళవింపు గాగాలదేమో ?

ఐడియా మాత్రమె ! ఎలా సాధ్యమో నాకు తెలియదు ఇప్పటికి.

కానీ సాధ్యమైతే (ఖచ్చితం గా కాగలదని అనుకుంటాను మీ వంటి కార్యశీలురు తలచు కుంటే ) ఈ ఇరవై ఒక్క శతాబ్దం లో ఇది ఒక సరికొత్త ప్రక్రియ అవుతుందేమో ?


చీర్స్
జిలేబి

SHANKAR.S చెప్పారు...

జిలేబీ గారూ బ్లాగ్లోక అంతర్జాతీయ అవధాన ప్రక్రియ అన్న ఆలోచన బావుంది. అయితే సమస్య, పూరణం ఇలా రెండూ కామెంట్ల రూపంలో జరిగితే ఆ లైవ్ ఫీలింగ్ ఉండదేమోనండీ. గూగుల్ ప్లస్ వాడి హ్యాంగ్ అవుట్ ఆప్షన్ తో ఒకేసారి అవధానిగారు, పృచ్చకులు, ప్రేక్షకులతో అవధాన ప్రక్రియ సాధ్యపడుతుందేమో. ముందుగా ఒక తేదీ, సమయం అనుకుని, అలాగే గూగుల్ ప్లస్ లో ఒక గుంపు ఏర్పరచి ఆ గుంపులోకి ఈ విషయమై ఆసక్తి ఉన్న వారందరికీ ఆహ్వానం పంపి కార్యక్రమం నిర్వహిస్తే బావుంటుందేమో.

@రామకృష్ణారావు గారు

గురువుగారూ మీ అభిప్రాయం కూడా తెలుసుకోగోరుతున్నాను

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరార్యా! శుభమస్తు.
మీ ఆలోచన చాలా బాగుంది.
యత్నే కృతే యది నసిద్ధ్యతి కోz త్ర దోషః?
తప్పక ప్రయత్నిద్దాం. మన ప్రయత్నము సఫలీకృత మగును గాక.
శుభమస్తు.

అజ్ఞాత చెప్పారు...

ఐం సరస్వత్యైనమ:

గురువుగారూ,online లో అవధానములు ఇదివరకే చేసినట్లు శ్రీ మేడసాని మోహన్ గారు ఒక రేడియో ఉపన్యాసంలో తెలిపినారు. ఆయన అమెరికాలో అవధానం చేస్తుంటే ఇండియా, ఇంగ్లాండ్, అమెరికా దేశాలలోని వివిధ ప్రాంతాలనుండీ పృచ్ఛకులు ప్రశ్నలు అడిగినట్లు తెలిపినారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.