గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, నవంబర్ 2011, మంగళవారం

హైదరాబాదు విచ్చేసిన శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి

శ్రీ మంగళంపల్లిని పరికిస్తున్న శ్రీ మానప్రగడ శేషశాయి. 
శ్రీమద్రామాయణ కల్పవృక్షాన్ని ఆంధ్రామృతంగా ఆంధృలకందించిన మహాకవి శ్రీ విశ్వనాధ వారికి ప్రియ శిష్యులు, మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల (విశ్రాంత)అధ్యక్షులు, ప్రసన్న భాస్కరాది గ్రంథ కర్త, విజయ నగర నివాసి, సత్కవి హృదయ వాసి ఐన శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి గురువరేణ్యులు మన భాగ్య నగరానికి  విచ్చేసారు.
Belsons Taj mahal. Secunderabad. 
Room No.112. లో బస చేసి యున్నారు.
వారి సెల్ నెంబరు 9160724305. 
ఆ జ్ఞాన వృద్ధుల, వయో వృద్ధుల దర్శన భాగ్యం అపురూపమైనది.
అవకాశమున్న సాహితీ ప్రియులకు వారి అపురూపమైన దర్శన భాగ్యం ఆ పరమాత్మ ఈ విధంగా కలిగిస్తున్నాఁడు.
ఔత్సాహికులు తప్పక కలవడానికి సదవ కాశమని ఈ విషయాన్ని మీ ముందుంచాను.
నిరవకాశులు సెల్ ద్వారా మాటాడడానికి వీలుగా వారి సెల్ నెంబరు కూడా మీ ముందుంచాను. 
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:

మన తెలుగు చెప్పారు...

అయ్యా! మానాప్రగడ వారు ఇంకా వ్యాసంగం చేస్తూ వుంటే, విశ్వనాధ వారి కల్పవృక్షం మీద అర్థ తాత్పర్యాలతో పుస్తకం వ్రాయించాలని సంకల్పము. ఏమంటారు?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.