బ్రహ్మశ్రీ మంగి పూడి వేంకట రమణ మూర్తి భాగవతార్.
ఆంధ్రామృత పాన లోలులారా! మనమిదివరకు ఎందరో మహాను భావులను గూర్చి వినడంలో అనాసక్తత చూప లేదు. మహానుభావులను తెలుసుకోవాలనే ఆసక్తితో ఎక్కడెక్కడికో వెళ్ళి వారిని కలుసుకొని, జన్మ చరితార్థమైందని సంతోషిస్తుంటాం. అలాంటిది ఆ పరమేశ్వరుని కృపావృష్టి నాపై కురవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన హరికథా విద్వాంసులు బ్రహ్మశ్రీ మంగి పూడి వేంకట రమణ మూర్తి భాగవతార్ మైత్రీ సంబంధంతో నాయింటికి వచ్చి మా గృహాన్ని పావనం చేసారని మీకు తెలియఁ జేయడానికి చాలా ఆనందంగా ఉంది.
మన మిదివరలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారినుద్దేశించి వారు వ్రాసిన బుర్ర కథను కూడా మన ఆంధ్రామృతం ద్వారా అనేక మందికి అందఁ జేయటం జరిగింది. వారు ప్రస్తుతం కార్యార్థులై మన భాగ్య నగరంలోనే ఉన్నారు. అనేక ప్రాంతాల్లో వారు హరి కథలు, ప్రవచనములు, భువన విజయాది ప్రదర్శనలు ఇస్తున్నారు.
మాయింటికి ఆ మహాను భావుని రాక మా అదృష్టం. పరమ భాగవతోత్తములైన వీరి యొక్క భగవత్ప్రార్థనలు మన రాష్ట్రమును సస్యశ్యామలంగా మంగళాకరంగా చేసి కాపాడాలని కోరుకొంటున్నాను.
జై శ్రీరాం.
జైహింద్.
4 comments:
బ్రహ్మశ్రీ మంగి పూడి వేంకట రమణ మూర్తి భాగవతార్ గారు మీ యింటికి విచ్చేసిన వివరములు చదివి మేము చాలా సంతోషించాము. వారితో మాకు కూడ చక్కని మైత్రీబంధము కలదు. వా మీ వలె సరస్వతీ పుత్రులు. సౌజన్యము మూర్తీభవించిన ఉత్తములు. మీదు మిక్కిలి చక్కని కవి. భావుకులు. మంచి హరికథకులు. వారి హరికథలను వినెడి భాగ్యము లోగడ నాకు దక్కినది. నా పదవీ విరమణ సందర్భముగా వారు చక్కని పద్య రత్నములను కూర్చి పెట్టిరి.
మీరు పెట్టిన పోష్టు నన్ను మిక్కిలి అలరించినది. మీకు నా ధన్యవాదములు.
బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకట రమణ మూర్తి గారు మా స్వగ్రామం రామునివలస వారు కావటం వల్లనూ, మా బావమరిది కి వియ్యంకులు కావటం వల్లనూ, వారితో సన్నిహిత స్నేహం ఏర్పడింది. ఆయన బహుముఖ ప్రఙ్ఞాశాలి అయి ఉండి కూడా, వినయ వివేక సంపన్నులు. తెలుగు, సంస్కృత భాషలలో మాకు ఎన్నో సందేహాలను నివృత్తి చేస్తుండటం పరిపాటి. ఉభయ భాషా ప్రావీణ్యంతో పాటు, నాటకం, హరి కథ, బుర్ర కథ, అవధానాది పలు సంగీత సాహిత్య ప్రక్రియలలో అందె వేసిన చేయి. ఇన్ని కళలు ఒక్క మనిషిలో నిక్షిప్తం కావటం చాలా అరుదైన విషయం. ఈ బ్లాగ్ లో ఆయనను పరిచయం చేయటం ముదావహం.
పంతులు జోగారావు గారూ ! మీరు పార్వతీపురం వాస్తవ్యులా ? అలా అయితే మరి కొన్ని పరిచయాలు చేసుకుందాము.
~జొన్నలగడ్డ కామేశ్వర రావు
కామేశ్వర రావు గారూ, మా స్వస్థలం మీరన్నట్టు పార్వతీ పురమే. నా మెయల్ pantulajogarao@gmail.com
ఇక, నేనూ, రమణ మూర్తీ, చింతా రామ కృష్ణారావు అంతా భాషా ప్రవీణ కలిసి చదివేం.
నేను కూడా రాముడు వలస చాలా సార్లు వచ్చేను.
పీసపాటి వారిని దర్శించు కున్నాను.
రమణ మూర్తి, చింతా రామ కృష్ణారావు వంటి మంచి మిత్రులు లభించడం నా భాగదేయం. వారిద్దరూ మంచి కవులు. పండితులు. మీరన్నట్టు రమణ మూర్తి గొప్ప హరికథకులు కూడా.
ఎందరెంరో మహాను భావుల్ని ఎంతో ఆసక్తితో వెళ్ళి కలుసు కోవడం వారిని ఇంటికి రప్పించుకుని అతిధి సత్కారాలు చేయడమే గాక మాకందరికి పరిచయం చేయడం శ్లాఘ నీయం . మీ దయవలన మేము కుడా గొప్ప వ్యక్తుల్ని తెలుసుకో గలుగు తున్నందుకు ధన్య వాదములు. " ఎదుటి వ్యక్తి ఉన్నతికి అసూయ పడే ఈ రోజుల్లో ,అందుకు భిన్నంగా గొప్ప గొప్ప వారని ఇలా పరిచయం చేసి వెలుగులు పంచాలను కునే మీ ఔన్నత్యం ! ఓ ...హో....! భాష కందదు .హేట్సాఫ్ !
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.