నిన్నంతా మహా శివ రాత్రి అని,
మీ హృదయ కైలాసంలో మమ్ములను ప్రతిష్ఠించి,
దివ్యమై భక్తి భావంతో ఉపవసించి,
అభిషేకాలు చేసి,
జాగరణ చేసి,
నా భక్త బాంధవుఁడు
చింతా రామ కృష్ణా రావు వ్రాసిన
శివాష్టకం పారాయణ చేసి,
మా యెడ విధేయతతో,
అంకిత భావంతో ప్రవర్తించి,
సేవించిన మీకు
మా పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది.
పలుపలు రూపముల్ కలిగి భక్తుల కేమగుపించుచుండగా
కలుషిత భావ జాలము కకావిక చేసి, చలింపఁ జేయగా,
నిలుపగ లేక మీ మనసు నిశ్చల భక్తిని చూపి మాపయిన్
కలత వహింపనేల? మిముఁ గాంతుము మేము శుభంబు లిచ్చుచున్.
మమ్ములనెట్లు కొలవాలో మీకు తెలిసినప్పుడు
మిమ్ములనెట్టులనుగమించాలో మాకు తెలియదా?
భక్తితో మీరున్నంత కాలం మీ వెంటే మేముంటాము.
శుభమస్తు.
సన్మనోవాంఛా ఫల సిద్ధిరస్తు.
2 comments:
పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
" మమ్మల్ని మీరు భక్తితొ కొలిచి నందుకు మెవెంట మేముంటాము " అని కళ్ళతొ పలకరించి మరీ చెబుతుంటే ఎదురుగా ప్రత్యక్షమై నిలచి నట్టుగా ఉంది. .చక్కని ఆర్టు . చిత్రం బాగుంది ఇక పద్యం వేరే చెప్పాలా ? అమ్మ వెన్నతొ పెట్టిన విద్య
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.