శ్రుతివిప్రతిపన్నా తే
యదా స్థాస్యతి నిశ్చలా
సమాధా వచలా బుద్ధి
స్తదా యోగ మవాప్స్యసి.
కll
నానావిధ శ్రవణాదుల
మానని కలతను వహించు మతి కలగక తా
ధ్యానము తిరముగ నిలిపిన
కానంబడు దైవమపుడు కరుణను మనకున్.
భావము:-
నానావిధములగు శ్రవణాదులచే కలత జెందియున్న నీ బుద్ధి యెపుడు చలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగ నిలిచియుండునో, అపుడు నీవాత్మసాక్షాత్కారమును బొందగలవు.
జై శ్రీరామ్.
జైహింద్.
Print this post
2 comments:
ఆర్యా,
మూడవ పాదములో గణభంగమైనట్టుంది. 'తిరముగను' బదులు ' తిరముగ ' అని ఉండాలనుకుంటా.
నమస్సులతో,
పుష్యం
ను నే అక్షరం పొరపాటున పడింది.గుర్తించి చెప్పిన పుష్యం గారికి ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.