ప్రియ పాఠకులారా!
మనం; మనకి మనంగా; మన ఆలోచనలతో ఏ సమస్యలనైనా; జీవిత సమస్యలనైనా సమర్థవంతంగా పరిష్కరించుకో గలిగామనే ఆత్మ విశ్వాసం పొందగలిగితే మన హృదయం నిత్యం వికాసవంతంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎవరెష్టును అధిరోహించినవా రెంతటి సంతోషం పొందుతారో అంతటి సంతోషం మనం సమస్యాపరిష్కారం చేయ గలిగిన క్షణంలో మనకీ కలుగుతుంది.
ఒక్క చిన్న పొడుపుకథే అవవచ్చు. దానికి మనం సమాధానం చెప్పగలిగితేనే సంతోషం పొందే మన మనస్సు కొంచెం క్లిష్టమైన సమస్యా పరిష్కారం చేయ గలిగితే ఉత్తేజితమౌతుందనడంలో సందేహం లేదు.
ఈ ఉద్దేశ్యం తోనే ఆంధ్రామృతం చెప్పుకోండి చూద్దాం అనే శీర్షికతో మీ ముందుంచుతోంది. మీ సమాధానాలు సరైనవవడం ఒక ఎత్తైతే; ఆ సమాధానం చెప్పే నిపుణత మరొక ఎత్తు. వచనరూపంలో చెప్పడ ఒక పద్ధతైతే; పద్య రూపంలో చమత్కారంగా ప్రతిస్ప్ందించడం ఒక పద్ధతి.
మీ మార్గమేమిటన్నది మీ సమాధానం ద్వారా పాఠకాళి గ్రహించడమే కాదు; ఉత్తమమైనదిగా భావించితే అనుసరించే ప్రయత్నం కూడా చేయక మానరు. తద్వారా మీరు మార్గదర్శకులగుదురు. ఈ క్రింది పద్యంలో గల పొడుపు కథకు మీ సమాధానం ఏమిటో గ్రహించడం కోసం పద్యం ఇంక చదవండి
ఆll
పదము లారు కలవు బంభరంబా? కాదు.
తొండముండుఁ; గాని దోమ కాదు.
రెక్కలుండుఁ; గాని పక్షి గా నేరదు.
దీని భావ మేమి తెలిసి కొనుడు.
చదివిరి కదా? ఆలస్యమెందుకు? సమాధానం మీదైన విశిష్ట శైలిలొ పంపగలరు కదూ? ధన్యవాదములు.
జై శ్రీరామ్.
జైహింద్.
Print this post
ఆలయలలో…తీర్థం .... సేవించే విధానం తెలుసుకుందాం.
-
ఆలయలలో…తీర్థం
ఆలయంలో తీర్థం ఎలా తీసుకోవాలి తీర్థం తీసుకున్నాక తలపై చేతితో ఎందుకు
రాయొద్దు..?
తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం తప్పక తెలుసుకోవాలి!
...
11 గంటల క్రితం
5 comments:
దోమ.
అది మక్షిక కాక మరియొకటి యగునా???
తుమ్మెద. ( సరళ భాష లో)
తుమ్మెద. ( సరళ భాష లో)
ఆరు కాళ్ళున్నా గానీ తుమ్మెద కాదు , తొండ ముంటుంది గాని దోమ కాదు ,రెక్క లుంటాయి గానీ పక్షి కాదు .మరేమిటి ?
జవాబు = " ఈగ "
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.