గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, సెప్టెంబర్ 2010, బుధవారం

మానవాళికి జీవితానుభవ సారం.

శ్లోll
క్షాంతిశ్చేత్ కవచేన కిం కిమరిభి: క్రోధో2స్తి చేద్దేహినాం,
ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,
కిం సర్పైర్యది దుర్జనా: కిము ధనైద్విద్యా2నవద్యా
వ్రీడా చేత్ కిము భూషణై: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ ?
తే.గీll
క్షాంతి కలిగిన కవచంబుఁ గలుగ నేల?
కలుగ క్రోధము శత్రువు కలుగ నేల?
జ్ఞాతి కలిగిన యగ్నిని కలుగ నేల?
కలుగ సన్మిత్రు లౌషధి కలుగ నేల?
కలుగ దుష్టులు సర్పముల్ కలుగ నేల?
కలుగ సద్విద్య ధనములు కలుగ నేల?
కలుగ సిగ్గు సుభూషలు కలుగ నేల?
కవి జనాళికి రాజ్యంబు కలుగ నేల?
భావము:-
ఓర్పు కల వానికి వేరే కవచం అక్కర లేదు.
కోపం కల వానికి వేరే శత్రువులెవరూ ఉండనక్కర లేదు.
దాయాదులు ఉంటే వేరే అగ్ని అక్కర లేదు.
మంచి మిత్రులున్న వారికి వేరే గొప్ప ఔషధాలతో పని లేదు. 
దుష్టులు ఉండగా వేరే విష సర్పాలతో పని లేదు.
మంచి విద్య ఉన్న వారికి వేరే గొప్ప నిధులు అక్కర లేదు. 
లజ్జ కలిగిన వారికి వేరే ఆ భరణాలు అక్కర లేదు. 
కవితా శక్తి కల వారికి వేరే రాజ్య మక్కర లేదు. 
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తన కొపమె తన శత్రువు ,శాంతమె రక్షణ కవచము ,సిగ్గే ఆభరణము ,కవితా క్షేత్రము కలిగిన వానికి అదే రాజ్యము నిజమె " అవన్నీ ఉంటే ఇక ఆ జీవి ధన్య మె మరి .చక్కని సూక్తి ముక్తాన్ని అందించారు ఈ ముత్యాలకి " అక్షర లక్షలు సరి పోవు "

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.