గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, సెప్టెంబర్ 2010, ఆదివారం

సహృదయ పూజ్యులైన ఉపాధ్యాయు లందరికీ శుభాకాంక్షలు.

Teachers' Day-1
సుజన మనోభిరామముగ శోభిల శిష్యుల తీర్చి దిద్దుచున్;
సృజనతఁ గొల్పు చుండి; గుణ శేముషి వెల్గ ప్రబోధఁ జేయుచున్;
ప్రజల హితంబునే వలచు ప్రాజ్ఞులు వెజ్జలు. వారి కెల్లెడన్
ప్రజల విశేష గౌరవము భక్తి ప్రపత్తులు గల్గు గావుతన్.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 
సహృదయ పూజ్యులైన ఉపాధ్యాయులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
జై శ్రీరామ్.
జైహింద్.
Print this post

4 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం గా పూజ్యనీయులైన గురువు లందరికి హృదయ పూర్వక శుభా కాంక్షలు

Pandita Nemani చెప్పారు...

ayya! namaste! mrr campakamaala surucira suMdara sugaMdha baMdhuramuga nunnadi. guruvaru laMdariki mamci abhinandana sandesamu amdimcina meeru dhanyulu. meeku maa abhinandanalu.
Sanyasirao nemani

Pandita Nemani చెప్పారు...

ayya! namaste! mee campakamala caala baaguMdi. meeku maa abhinandanalu - subhaakaamkshalu.
Sanyasirao nemani.

రవి చెప్పారు...

ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మా గురువులైన మీకు పాదాభివందనం, గురుదేవులైన అందరికీ వినమ్ర ప్రణామాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.