శ్లోll
కృషితో నాస్తి దుర్భిక్షమ్ - జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి - నాస్తి జాగరతో భయమ్.
గీll
కృషిని చేసిన దుర్భిక్ష విషము తొలగు.
జపముఁ చేసిన పాతక చయము తొలగు.
మౌనముద్రను కలహంబు మాయమగును.
జాగ్రతన్భయ మొలయదు. సద్గుణాఢ్య!
భావము:-
వ్యవసాయము చేసినచో కఱవు ఉండదు. జపము చేసిన పాతకములుండవు. మౌనముగా నుండిన కలహము లుండవు. జాగ్రత్తగా నుండిన భయము ఉండదు.
జై శ్రీరామ్.
జైహింద్.
Print this post
1 comments:
అన్నీ బాగున్నాయి గానీ మౌనంగా ఎవరైనా ఉండగలరా ? ఇలాంటి ఆణిముత్యాలు చదివాకైనా ఉండ గలిగితె ముదావహం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.